SSMB28: మహేష్ త్రివిక్రమ్ మూవీపై అంచనాలు పెంచే న్యూస్ ఇదే!

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి గతేడాది అధికారక ప్రకటన వెలువడినా ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక కాగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచే న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే మహేష్ మూవీ షెడ్యూల్ తో పృధ్వీరాజ్ సుకుమారన్ డేట్లు మ్యాచ్ కావడం లేదని పృధ్వీరాజ్ ఈ సినిమాలో నటించేలా త్రివిక్రమ్ షెడ్యూల్ లో మార్పులు చేసే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పృధ్వీరాజ్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరోతో పాటు సమానమైన పాత్రలో పృధ్వీరాజ్ నటించనున్నారని బోగట్టా.

మహేష్, పృధ్వీరాజ్ కలిసి నటిస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడంతో పాటు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. త్రివిక్రమ్ ఈ సినిమాతో అల వైకుంఠపురములో సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుండటం గమనార్హం. త్రివిక్రమ్ ఈ సినిమా కోసం భారీస్థాయిలో పారితోషికం తీసుకోనున్నారని తెలుస్తోంది. సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ విడుదలైన తర్వాత మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ 2025 లేదా 2026లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి సినిమా కోసం రెండేళ్లైనా కేటాయిస్తానని మహేష్ బాబు పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus