Malavika Mohanan: పాపం ఎన్ని అందాలు ఆరబోసినా కనికరించని బాలీవుడ్ బాక్సాఫీస్.!
- September 21, 2024 / 04:33 PM ISTByFilmy Focus
ఎప్పుడో 2013లో కెరీర్ మొదలుపెట్టిన మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఇప్పటివరకు కేవలం 10 సినిమాలు చేసింది. వాటిలో హిట్ అయిన ఏకైక సినిమా ఇటీవల విడుదలైన “తంగలాన్”(Thangalaan). విక్రమ్ నటించిన ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే బాగా ఆడింది. ఆ తర్వాత హిందీలో రిలీజ్ చేయగా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే.. ఎప్పుడో 2017లోనే “బియాండ్ ది క్లౌడ్స్” బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్, మళ్లీ 2024లో “యుద్ర” అనే సినిమాతో అఫీషియల్ డెబ్యూ ఇచ్చింది.
Malavika Mohanan

నిన్న (సెప్టెంబర్ 20) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి దారుణమైన రివ్యూలు, రేటింగులు వచ్చాయి. “గల్లీ బాయ్” ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది హీరోగా రూపొందిన ఈ యాక్షన్ చిత్రం కనీస స్థాయిలో కూడా అలరించలేకపోయింది. మరీ ముఖ్యంగా బేసిక్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. దాంతో ఈ సినిమాను బాలీవుడ్ మీడియా డిజాస్టర్ గా డిక్లేర్ చేసింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఈ సినిమాలో మొహమాటపడకుండా అందాలు ఆరబోసి, లెక్కలేనన్ని లిప్ లాప్ లు ఇచ్చినప్పటికీ లాభం లేకుండాపోయింది.

ఇకపోతే.. మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రస్తుతం ప్రభాస్ సరసన “రాజా సాబ్” (The Rajasaab) లో నటిస్తోంది. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సన్నద్ధమవుతోంది. దాంతోపాటు తమిళంలో కార్తీ (Karthi) సరసన “సర్దార్ 2” (Sardar) కూడా ఒకే చేసింది. బాలీవుడ్ ఎలాగూ అచ్చిరాలేదు కాబట్టి ఇకపై తెలుగు, తమిళ సినిమాలు చేసుకుంటూ..

ఎప్పట్లానే ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోలు, రీల్స్ తో హల్ చల్ చేయడం కంటిన్యూ చేస్తే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం. ఎందుకంటే సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఆమె కొత్త ఫొటోలు ఎప్పడు అప్లోడ్ చేస్తుందా అని ఇంటర్నెట్లో జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు.















