యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర (Devara) రిలీజ్ కు 5 రోజుల సమయం మాత్రమే ఉంది. సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం టెన్షన్ పెరుగుతోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ ఫ్యాన్స్ మధ్య జోరుగా జరుగుతోంది. గతంలోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేలా కామెంట్లు చేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (R. Rathnavelu) తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
Rathnavelu
దేవర మూవీ కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ కోసం 30కు పైగా నిద్రలేని రాత్రులు గడిపామని ఆయన అన్నారు. మేము ఇచ్చిన కంటెంట్ ను కంపెనీలు మాకు సరైన సమయానికి అందించాయని రత్నవేలు చెప్పుకొచ్చారు. మా దేవరను థియేటర్లలో చూసి ఆనందించాలని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా దేవర మూవీ ఉంటుందని ఆయన తెలిపారు.
మరోవైపు దేవర సినిమాలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. దేవర మూవీలో రొమాంటిక్ సీన్స్ కొత్తగా ఉంటాయని తారక్ పేర్కొన్నారు. దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సినిమా టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది.
దేవర సినిమాకు సంబంధించి విడుదలవుతున్న కొత్త పోస్టర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. దేవర సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. దేవర సినిమా ట్విస్టులు సైతం అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది. దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2 గంటల 42 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.