‘ప్రేమలు’ (Premalu) సినిమాతో తెలుగు యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మమితా బైజు (Mamitha Baiju) , ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో ట్రెండింగ్ బ్యూటీగా మారింది. మలయాళంలో ఆరేళ్లుగా నటిస్తూ మోస్తరుగా కొనసాగిన మమితాకు ఒక్క సినిమా ఆమె కెరీర్‌ను ఊహించని రీతిలో మార్చేసింది. ఈ చిన్నది చూపిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే, ప్రేమలు సక్సెస్ తర్వాత మమితాకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చినా, అప్పటికే తమిళం, మలయాళం ప్రాజెక్టులకు కమిట్ అయ్యుండటంతో వాటిని ఓకే చేయలేకపోయింది.
టాలీవుడ్ మేకర్స్ ఆమెను ఓ క్షణం కూడా వదలకుండా టచ్‌లో ఉండటమే కాకుండా, పలు కథలు కూడా చెప్పారట. కానీ మమితా కథల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉందట. డైరెక్ట్ కథకు ప్రాధాన్యత ఉండాలి తప్ప, కేవలం సాంగ్స్, గ్లామర్ ప్రెజెన్స్ కోసమే అయితే కాదని స్పష్టం చేసిందట. ప్రస్తుతం మమితా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రదీప్ రంగనాథ్ తో (Pradeep Ranganathan) ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు టాక్.
ఇది అధికారికంగా ఎనౌన్స్ కాకపోయినా, మమితా తెలుగు ఎంట్రీకి ఇది మంచి స్టెప్పవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె తెలుగులో తన కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటే టాప్ రేంజ్‌లోకి వెళ్తుందనడంలో సందేహం లేదు. ఒకవైపు తమిళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా, మమితా సోషల్ మీడియాలో ఇప్పటికీ తెలుగు అభిమానుల అటెన్షన్ తీసుకుంటోంది. ఆమె పిక్స్, స్టోరీస్, వీడియోలపై తెలుగు యూత్ నుంచి వస్తున్న స్పందన చూస్తే..
ఆమె తెలుగులో ఎప్పుడైనా ఫుల్ ఎంట్రీ ఇస్తే బిగ్ రిసెప్షన్ ఖాయం. ‘ప్రేమలు’ సినిమాకు ఓ సంవత్సరం పూర్తవుతున్నా, మమితా పాపులారిటీ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో న్యూ ఫేస్ కోసం చూస్తున్న దర్శక నిర్మాతలు ఆమెను మిస్ అవుతున్నారనడంలో సందేహం లేదు. ఇకపై మమితా బైజు తెలుగులో ఎలాంటి క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.