దుల్కర్ డీల్ క్యాన్సిల్ చేయించిన మమ్ముట్టి!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘కురుప్’. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి భారీ స్పందన వచ్చింది. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిజానికి ‘కురుప్’ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతోంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మొదట ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారట. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.40 కోట్ల డీల్ ను ఆఫర్ చేశారట. చిత్రబృందం కూడా పాజిటివ్ గా ఉండడంతో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ దుల్కర్ సల్మాన్ తండ్రి, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమా చూసిన ఓటీటీ డీల్ ను రద్దు చేసి

థియేటర్లో సినిమా విడుదల చేయమని మేకర్స్ ను ఒప్పించారట. తండ్రి చెప్పడంతో దుల్కర్ వెంటనే రూ.40 కోట్ల ఓటీటీ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకొని సినిమాను థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ సినిమాను దుల్కర్ స్వయంగా నిర్మించడం విశేషం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus