తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మమత మోహన్ దాస్ గురించి అందరికీ సుపరిచితమే ఈమె కన్నడ తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ప్రాణాంతకరమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారు.ఇలా ఒకసారి కాదని రెండుసార్లు ఈమె క్యాన్సర్ బారిన పడటంతో ఏమాత్రం కృంగిపోకుండా ఎంతో ధైర్యంగా క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొని బయటపడ్డారు.
ఈ విధంగా క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నటువంటి ఈమె తిరిగి యధావిధిగా సినిమాలతో బిజీ అయ్యారు. అయితే ఇలా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మరో ప్రాణాంతకరమైన వ్యాధి ఈమెను వెంటాడింది. మమతా మోహన్ దాస్ ఆటో ఇమ్యూన్ కి గురయ్యారు. అది బొల్లి వ్యాధికి దారి తీసింది. అందాన్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే హీరోయిన్స్ కి బొల్లి వ్యాధి సోకడం అంటే వారి బాధ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
ఇలా ఈ వ్యాధి బారిన పడిన ఈమె ఆ సమయంలో ఎలాంటి మానసిక క్షోభను ఎదుర్కొన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ…తనకు క్యాన్సర్ సోకినప్పుడు తనకు వచ్చిన సమస్యను నలుగురితో చెప్పుకున్నాను. ఇలా తన స్నేహితులకు తన సమస్య తెలిసి తనకు అండగా నిలిచారని దాంతో తాను ఈ వ్యాధిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నానని తెలిపారు.
నేను మహేష్ మారుతియం షూటింగ్ టైం లో ఒంటి పై మచ్చలు గమనించాను. అవి ముఖం, చేతులు, మెడపై వ్యాపించాయి. పరీక్షల్లో బొల్లి వ్యాధి అని తేలడంతో ఒంటరిగా ఎంతో కృంగిపోయానని నెలల తరబడి గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చానని తెలిపారు. ఆ సమయంలో తాను చనిపోతానేమోనని భయం కూడా తనకు కలిగిందని ఆ సమయంలో తనకు వచ్చిన ఈ సమస్య గురించి అందరితో చెప్పుకోవడంతో తనకు కాస్త ఉపశమనం కలిగింది అంటూ ఈమె తను పడిన మానసిక వేదన గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?