సీనియర్ స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు ఇప్పటివరకు లేవు. ఆ కొరతని తీర్చేందుకు.. చిరు, వెంకీ చేతులు కలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘మనశంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankaravaraprasad Garu) సినిమాలో వెంకటేష్ అతిధి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది ఈ సినిమా. వెంకటేష్ పాత్ర దాదాపు 20 నిమిషాలు ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
అలాగే చిరు- కాంబినేషన్లో ఒక పాట కూడా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఆ లిరికల్ సాంగ్ ను కొద్దిసేపటి క్రితం ‘మెగా విక్టరీ మాస్’ లిరికల్ పేరుతో రిలీజ్ చేశారు.ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 15 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైంటీ.. ఎవడైతే ఏంటి? కుమ్మేద్దాం చంటి..హేయ్ వెంకీ.. ఇచ్చేయి ధమ్కీ’ అంటూ సాంగ్ మొదలైంది. ‘ఏందీ బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి’ అంటూ వచ్చే లిరిక్స్ మంచి హై ఇచ్చాయి.

కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం సమకూర్చారు. భీమ్స్ అందించిన ట్యూన్ కూడా బాగుంది. నకాష్, విశాల్ చిరు, వెంకీ..ల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు పాడారు. విజయ్ పోలాకి కూడా కంపొజిషన్ అదే పద్దతిలో చేశాడు. చిరు, వెంకీ..ల శ్వాగ్ ఈ సాంగ్ కి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. సంక్రాంతి వైబ్స్ ను క్యాచ్ చేసే విధంగా.. పండగ మూడ్ కి తగ్గట్టు ఈ పాటని తీర్చిదిద్దారు. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :
