చిన్న వయసులోనే నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మి రాణిస్తోంది. బుల్లి తెర పై ఆమె చేసిన మేము సైతం కార్యక్రమం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు పంచుతోంది. ఒక తల్లిగా, భార్యగా వ్యక్తిగత జీవితంలో తన భాద్యతలను నెరవేరుస్తూనే టెలివిజన్, సినీ రంగంలో దూసుకు పోతోంది. త్వరలో హాలీవుడ్ చిత్రంలోనూ కనిపించనున్న లక్ష్మి టాలీవుడ్ లోని పరిస్థితుల గురించి ఆశ్చర్యకరమైన సంగతులు వెల్లడించింది. “చిన్నప్పుడు రైటర్స్, డైరక్టర్స్, ప్రొడ్యూసర్ల హడావుడి ఇంట్లో చూసా. వాళ్ల కళ్ల ఎదురుగానే పెరిగా. అందరూ మనవాళ్లే అనుకుని ఇండస్ట్రీ లోకి వచ్చా. కానీ వాస్తవం కఠోరంగా ఉంది.
ఈ రంగంలో నో బడీ ఈజ్ చుట్టాలు ఫర్ ఎనీ బడీ.. “నువ్వు నాకు చెల్లిలాంటిదానివమ్మా.. మీ అమ్మ నాకు చిన్నపటి నుంచి తెలుసమ్మా. శాటిలైట్ నాకే ఇవ్వాలమ్మా” అంటారు. తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వరు. ఫోన్ కూడా ఎత్తరు. మొదట్లో నేను అందరినీ నమ్మేదాన్ని. కానీ ఈ అనుభవాలనీ నన్ను రాటు దేల్చాయి. నన్ను రాయిలా చేసింది అమెరికా కాదు. మన ఇండస్ట్రీనే” అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి చెప్పింది. డైలాక్ కింగ్ మోహన్ బాబు వాస్తవాన్ని ఎవరికీ భయపడకుండా చెప్పడంలో ముందుంటారు. అదే తీరుగా అయన కూతురు పరిశ్రమలోని పరిస్థితిని ధైర్యంగా చెప్పి తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది.