నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన మాస్ సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ. కానీ ఆయన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అందులో సింగీతం శ్రీనివాస్ (Singeetam Srinivasa Rao) దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’ (Aditya 369) సినిమా ఒకటి.1991 లో టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. 1991 జూలై 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ రోజుల్లో రూ.1.6 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ 2 రకాల పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ- రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 4న ఈ సినిమా రీ- రిలీజ్ కానుంది. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కి కూడా నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి.
కాబట్టి.. కచ్చితంగా ఈ సినిమాని థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేస్తే.. బాగుంటుంది అనే ఆలోచన కూడా అందరిలోనూ ఉంది. ఇదిలా ఉండగా.. ‘ఆదిత్య 369’ సెట్స్ లో అక్కినేని నాగార్జున (Nagarjuna) సందడి చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘ఆదిత్య 369’ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న టైంలో తీసిన ఫోటో ఇది అని స్పష్టమవుతుంది. 30.. లలో ఈ ఇద్దరు హీరోలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నారు.