ర్యాంప్ పై హొయలొలికిస్తుంది. యాంకర్ గా టీవీ ముందు కట్టిపడేస్తుంది. నటిగా కన్నీళ్లు తెప్పిస్తుంది. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మిస్తుంది… మంచు లక్ష్మి ప్రసన్న గురించి ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోవు. దైర్యంగా వెండితెర, బుల్లి తెరపై అనేక ప్రయోగాలకు నాంది పలికింది… విజయాన్ని అందుకుంది. ఈ మల్టీ ట్యాలెంటెడ్ లేడీ నేడు (అక్టోబర్ 8) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి మీకు తెలియని సంగతులు..
1. డేరింగ్ లేడీడైలాగ్ కింగ్ మోహన్ బాబు, విద్య దేవిల ఏకైక కుమార్తె లక్ష్మి ప్రసన్న. ఈమె 1970 అక్టోబరు 8 న జన్మించింది. మోహన్ బాబు లాగా దైర్యంగా మాట్లాడడం ఆమెకు చిన్నప్పటి నుంచే అబ్బింది.
2. ప్రేమ వివాహంలక్ష్మి హైదరాబాద్ లోని సెంట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదువుకుంది. అక్కడే క్లాస్ మేట్ ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి విడాకులు తీసుకుంది.
3. పెళ్లిఅమెరికా వెళ్లిన లక్ష్మి అక్కడే అనేక కంపెనీల్లో పనిచేసి ఎవరిపై ఆధారపడకుండా జీవించేది. ఆ సమయంలో పరిచయమైన ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ ప్రేమించి పెళ్లిచేసుకుంది.
4. సరోగసీ పాపవిదేశాల్లో సరోగసీ ద్వారా పిల్లలు జన్మనివ్వడం సర్వ సాధారణం. ఆ సంస్కృతిని మంచు లక్ష్మి తెలుగు వారికి పరిచయం చేసింది. టాలీవుడ్ సెలబ్రిటీల్లో తొలి సారిగా సరోగసీ పద్ధతిలో తల్లి అయి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాసన్ దంపతుల ముద్దుల కూతురి పేరు విద్య నిర్వాణ.
5. ఉత్తమ విలన్హాలీవుడ్ చిత్రాల ద్వారా వెండితెరకు పరిచయమైన మంచు లక్ష్మి “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో తెలుగు తెరపై విలనిజం చూపించింది. ఇందులోని నటనకు గాను ఆమె ఉత్తమ విలన్ గా నంది పురస్కారం అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా గుండెల్లో గోదారి, దొంగాటలో నటించి మెప్పించింది.
6. సొంత నిర్మాణంతండ్రి మోహన్ బాబు నెలకొల్పిన నిర్మాణ సంస్థ ఉన్నా, తానేమిటో నిరూపించుకోవాలని మంచు ఎంటర్టైన్ మెంట్ సంస్థను మంచు లక్ష్మి స్థాపించింది. గుండెల్లో గోదారి, దొంగాట సినిమాలు నిర్మించి, విజయాలను సొంతం చేసుకుని తండ్రి తగ్గ కూతురనిపించుకుంది.
7. ప్రేమతో మీ లక్ష్మిమంచు లక్ష్మి బుల్లి తెరపైన పలు షోలు నిర్మించింది. కొన్నింటికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. లక్ష్మి టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి, దూసుకెళ్తా వంటి కార్యక్రమాలు బాగా ఫేమస్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె “మేము సైతం” అనే షో ద్వారా కష్టాల్లో ఉన్న వారికి చేయూతనందిస్తోంది.
8. సింగర్నటిగా, నిర్మాతగానే కాకుండా గాయనిగా మంచులక్ష్మి తన ప్రతిభను చాటుకుంది. దొంగాట సినిమా లో “ఏందిరో” అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు ని అందుకుంది.
9. ఫిట్ నెస్వ్యక్తిగతంగా, వృత్తిపరమైన ఎన్ని ఒత్తిడులు ఉన్నా మంచి లక్ష్మి ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. నిత్యం యోగాతో పాటు ఎక్సర్ సైజ్ చేస్తుంది. అందుకే ఆమెకు నలభై ఆరేళ్లు అంటే ఎవరూ నమ్మరు.
10. భోజన ప్రియురాలుమంచు లక్ష్మి మంచి భోజన ప్రియురాలు. ఆ ఇష్టంతోటే భర్తతో కలిసి ‘జూనియర్ కుప్పన్న’ పేరుతో హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించింది.