Manchu Manoj: నమస్తే వరల్డ్ సీఈఓగా భూమా మౌనిక?

మంచు మనోజ్ భూమ మౌనిక ఈ ఏడాది రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇదివరకు వేరే వ్యక్తులతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే వారితో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు అయితే గత ఆరు సంవత్సరాల క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని పలు సందర్భాలలో మనోజ్ వెల్లడించారు. ఇలా ఇన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట వివాహం చేసుకొని ఇద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

మనోజ్ (Manchu Manoj) రెండో పెళ్లి తర్వాత కెరియర్ పరంగా సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. ఇక మౌనిక సైతం రాజకీయాలలోకి వస్తుందని అందరూ భావించారు కానీ ఈమె రాజకీయాలకు దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. భూమా మౌనిక మనోజ్ ఇద్దరు కూడా నమస్తే వరల్డ్ అనే టాయ్స్ కంపెనీ నిర్వహించబోతున్నారని ఇందుకు మౌనిక సీఈవోగా వ్యవహరిస్తున్నారని మనోజ్ వెల్లడించారు.

నమస్తే వరల్డ్ ద్వారా పిల్లలు ఆడుకునే వివిధ రకాల టాయ్స్ బొమ్మల యానిమేషన్స్, కార్టూన్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే ఐమాక్స్ లో స్టోర్ ను ప్రారంభించారు. తమ టాయ్స్, జియో మార్ట్, రిలయెన్స్ ల్లోనూ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఈ విధంగా జియో మార్ట్ రిలయన్స్ సంస్థలతో వీరు భాగస్వామ్యం కావడంతో ఇటీవల ముఖేష్ అంబానీని కూడా కలిశారనే విషయం తెలుస్తోంది.

తాము ఈ బిజినెస్ ప్రారంభించాలి అనే ఆలోచన తమకుమారుడు దైరవ్ నాగిరెడ్డి కారణంగానే ఈ ఆలోచన వచ్చిందని మనోజ్ ఈ సందర్భంగా వారు ప్రారంభించినటువంటి బిజినెస్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus