Manchu Manoj: ఆ దర్శకునికి క్షమాపణలు చెప్పా.. మనోజ్ కామెంట్స్ వైరల్!

మంచు మనోజ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రకటన వెలువడిన సినిమాలలో అహం బ్రహ్మాస్మి ఒకటి కాగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మనోజ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. అహం బ్రహ్మాస్మి సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డామని మనోజ్ అన్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి చరణ్ వచ్చాడని మనోజ్ తెలిపారు. భూమా మౌనికతో నా బంధాన్ని అంగీకరించలేదని ఆ సమయంలో అహం బ్రహ్మాస్మి సినిమా లేదా లవ్ లో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మనోజ్ చెప్పుకొచ్చారు.

నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి నిలబడటంతో ఆ సమయంలో కెరీర్, డబ్బు కోసం ఆశ పడి అటువైపు అడుగు వేసి ఉంటే ప్రాణాలతో ఉండి వృథా అనిపించిందని మనోజ్ అభిప్రాయపడ్డారు. అలా నేను బ్రతకలేనని ఆ విధంగా నేను మౌనికను, బాబును ఎంచుకున్నానని మనోజ్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మేము చెన్నైకు వెళ్లి ఏడాదిన్నర అక్కడే ఉన్నామని నిజాయితీగా ముందుకు వెళ్లేవాళ్లకు ఎక్కువగా కష్టాలు వస్తాయని మనోజ్ పేర్కొన్నారు.

శ్రీకాంత్ అహం బ్రహ్మాస్మి సినిమాకు దర్శకుడు అని ఆయనకు క్షమాపణలు చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకోవడం జరిగిందని మనోజ్ అభిప్రాయపడ్డారు. శ్రీకాంత్ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడని మనోజ్ కామెంట్లు చేశారు. భవిష్యత్తులో మేమే అహం బ్రహ్మాస్మి సినిమాను నిర్మిస్తామని మనోజ్ తెలిపారు. మనోజ్ ప్రస్తుతం వాట్ ద ఫిష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా సినిమాకు మనోజ్ (Manchu Manoj) కు క్రేజ్ పెరుగుతుండగా మనోజ్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. మనోజ్ వాట్ ద ఫిష్ తో సక్సెస్ సాధిస్తే క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మనోజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus