Manchu Manoj: నా సందేశం యొక్క అసలు లక్ష్యం అదే.. మనోజ్ ఏమన్నారంటే?

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manoj) తాజాగా మోహన్ బాబు (Mohan Babu) పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వైరల్ అయిన వీడియో గురించి వివరణ ఇచ్చారు. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా సభ్యులకు ధన్యవాదాలు అని మంచు మనోజ్ కామెంట్లు చేశారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. నా తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో నేను చెప్పిన మాటలను కొంతమంది అపార్థం చేసుకున్నారని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

దానిపై నేను స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నానని మనోజ్ వెల్లడించారు. ఈవెంట్ లో నా ప్రసంగం చుట్టూ కొంత గందరగోళం ఏర్పడిందని ఆయన అన్నారు. దేశంలో ఐక్యత, గౌరవం, రాజకీయ సరిహద్దులను అధిగమించడమే నా ప్రధాన ఉద్దేశం అని మనోజ్ కామెంట్స్ చేశారు. దురదృష్టవశాత్తూ లైవ్ స్ట్రీమింగ్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కార్యక్రమం పూర్తిగా ప్రసారం కాలేదని ఆయన తెలిపారు.

నా మాటల్లో కొన్ని మాత్రమే ప్రజలకు చేరాయని నా సమాచారాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని మనోజ్ చెప్పుకొచ్చారు. నా ప్రసంగంలో ఏ రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదని మనోజ్ అభిప్రాయపడ్డారు. పూర్తి ప్రసంగాన్ని నా ట్విట్టర్ అకౌంట్ లో అప్ లోడ్ చేశానని మనోజ్ వెల్లడించారు. కులం, మతానికి అతీతమైన వసుధైక కుటుంబం విలువలను మా నాన్న నేర్పించాడని ఆయన అన్నారు.

మరోసారి బుల్లితెరపై మీ అందరినీ అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని మనోజ్ తెలిపారు. మనోజ్ క్లారిటీతో వివాదానికి చెక్ పడినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ ప్రస్తుతం సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. వాట్ ద ఫిష్ టైటిల్ తో మనోజ్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు ఒక సినిమాలో మనోజ్ విలన్ రోల్ పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మనోజ్ సినిమాల గురించి మరింత క్లారిటీ రానుంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus