Manchu Manoj: ప్రేమ పెళ్లి గురించి షాపింగ్ విషయాలు బయటపెట్టిన మంచు మనోజ్!

మంచు మనోజ్ భూమా మౌనిక వివాహం తర్వాత మొదటిసారి వెన్నెల కిషోర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ దంపతులు తమ ప్రేమ పెళ్లి గురించి వారి జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నలకు మనోజ్ మౌనిక చెప్పినటువంటి సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

రెండు కుటుంబాల మధ్య 15 సంవత్సరాల నుంచి ఎంతో మంచి స్నేహం ఉందని తెలిపారు. ఇలా మా రెండు కుటుంబాలలో స్నేహం ఉండటం వల్ల మంచి చెడులకు హాజరయ్యే వాళ్ల మని తెలిపారు. ఇక మేమిద్దరం మా జీవితంలో వేరువేరు దిశలలో అడుగులు వేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి ఇలా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ఇలా కలిసామని మనోజ్ తెలిపారు. అయితే ఇద్దరిలో ముందుగా తానే మౌనికకు ప్రపోజ్ చేశానని మనోజ్ తెలిపారు.

ఇలా తనని ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని మౌనికకు చెప్పగానే సరేగాని ఆలోచించావా అని ప్రశ్నించింది. సరిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని నువ్వు ఒప్పుకుంటే నిన్ను బాబును నా జీవితంలోకి ఆహ్వానిస్తానని చెప్పాను.ఆ సమయంలో ఇంట్లో చెప్పవా ఈ సొసైటీ ఒప్పుకుంటుందా అని ఎన్నో రకాల ప్రశ్నలు వేసింది అయితే నాకు సొసైటీతో పని లేదని చెప్పాను.ఇక ఇంట్లో ఈ విషయం చెప్పగానే నో చొప్పారు ఆయనప్పటికీ అది నా సమస్య కావడంతో నా సమస్యకు నేనే పరిష్కారం చేసుకుంటానని చెప్పాను.

ఇక శివుడికి వినాయకుడు ఎలా దొరికారో నాకు ధైరవ్ అలా దొరికారని (Manchu Manoj) మనోజ్ వెల్లడించారు.ఇలా మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత మా వనవాసం మొదలైంది. ఉప్పెన సినిమాలో ఈశ్వర సాంగ్ తరహాలో మేము కూడా దేశ దేశాలు తిరిగామని మనోజ్ తెలిపారు.అయితే మాటలలో చెప్పినంత ఈజీగా మా జీవితం ఏమి సాగలేదని ఎన్నో ఇబ్బందులు పడి మా ప్రేమను గెలిపించుకున్నాము అంటూ ఈ సందర్భంగా మనోజ్ తమ ప్రేమ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus