Manoj, Mounika: పెళ్లికి ముందే చెన్నైలో కాపురం పెట్టిన మనోజ్.. బయటపడిన నిజం!

భూమా మౌనిక మనోజ్ గత నెల వివాహం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పెళ్లయినప్పటి నుంచి మనోజ్ చాలా యాక్టివ్ అవుతూ పలు కార్యక్రమాలకు తన భార్యతో కలిసి వెళుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర పై ప్రసారమవుతున్న అలా మొదలైంది కార్యక్రమానికి కూడా మౌనికతో కలిసి మనోజ్ హాజరయ్యారు.ఈ క్రమంలోనే మనోజ్ మౌనికతో తన రిలేషన్ గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు. మనోజ్ గత నాలుగు సంవత్సరాలుగా మౌనికతో రిలేషన్ లో ఉన్నారని,వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి చెన్నైలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ వార్తలపై మనోజ్ (Manoj) స్పందించారు.ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ మౌనిక తన ప్రేమకు అంగీకరించిన తర్వాత మేము హైదరాబాద్ లో ఉంటే బాగోదని చెన్నై వెళ్లిపోయామని తెలియజేశారు. ఇలా చెన్నైలో దాదాపు ఏడాదిన్నర పాటు కలిసే ఉన్నామని ఈ సందర్భంగా మనోజ్ మౌనిక తో ఉన్నటువంటి రిలేషన్ గురించి బయట పెట్టారు.ఇక ఇంట్లో వారికి మౌనిక గురించి చెప్పడంతో మొదట్లో నో చెప్పారని అయితే చివరికి తన కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని మనోజ్ వెల్లడించారు.

ఇక చెన్నై వెళ్లిన తర్వాత మా ప్రేమ ప్రయాణం కూడా ఉప్పెన సినిమాలో మాదిరిగా దేశ దేశాలు తిరుగుతూ వనవాసం చేశామని ఈ సందర్భంగా మనోజ్ వెల్లడించారు. ఇలా వీరిద్దరూ మొదట వివాహం చేసుకొని వారి జీవిత భాగస్వామిలకు విడాకులు ఇచ్చే అనంతరం వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ వీరి ప్రేమను గెలిపించుకొని చివరికి ఒకటయ్యారు.

అయితే మౌనిక కోసం తాను అహం బ్రహ్మాస్మి సినిమాని కూడా వదులుకోవాల్సి వచ్చిందని అందుకే ఆ సినిమా ఆగిపోయిందని ఈ సందర్భంగా మనోజ్ ఈ విషయాన్ని బయట పెట్టారు.మౌనికనా.. సినిమానా అని ఆలోచిస్తే తనకు మౌనికే ముఖ్యమని భావించి సినిమాని వదులుకున్నానని తెలిపారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus