‘మనోజ్ (Manchu Manoj) వర్సెస్ విష్ణు(Manchu Vishnu)’ అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకో హడావిడిగా మంచు మనోజ్ తాజాగా మీడియా ముందుకు వచ్చి ‘విష్ణు నాపై పగబెట్టుకుని ఏంటేంటో చేస్తున్నాడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మంచు మనోజ్ మాట్లాడుతూ… “ఈరోజు వరకు ఈ మనోజ్.. ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుండి. నేను బయట ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేసుకుని.. బయట ప్రొడక్షన్లో చేసిన సినిమాతో హిట్టు కొడితే చాలు.. తీసుకొచ్చి నన్ను ఇక్కడ లాక్ చేసేసేవారు.
విష్ణు కంపెనీలో ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ లో నువ్వు సినిమా చేయాలి అని నన్ను కట్టిపడేసేవారు. తర్వాత ‘ఒరేయ్ నువ్వు లేడీ గెటప్ వేసుకుని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా? విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది’ అంటూ సెంటిమెంట్ గా నన్ను కూర్చోబెట్టి చెప్పేవారు. విష్ణుని హీరోగా నిలబెడదాం.నువ్వు కామెడీ బాగా చేస్తావ్ అని అన్నారు. ‘లేడీ గెటప్ అంటే ఇప్పుడు నాకు కంఫర్ట్ గా లేదు’ అని చెప్పినా సరే వినలేదు. అయినా సరే అన్న కోసం నేను లేడీ గెటప్ వేసుకుని చేశాను.
సాంగ్స్ కంపోజ్ చేశాను. గ్రాఫిక్స్ చేశాను. నేను అక్కడ చేయని గొడ్డు చాకిరీ అంటూ లేదు. నేను గ్రాఫిక్స్ చదివితే.. అతను(విష్ణు) గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు. మా నాన్న (Mohan Babu) థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు” అంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశాడు. అయితే మనోజ్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏమున్నాయి. ఇంకా విష్ణు కెరీర్లో ‘ఢీ’ (Dhee) ‘రెడీ’ ‘దూసుకెళ్తా’ (Doosukeltha) ‘ఈడో రకం ఆడో రకం’ (Eedo Rakam Aado Rakam) వంటి హిట్లు ఉన్నాయి. మరి ఈ స్టేట్మెంట్ ను ఆడియన్స్ ఎలా అర్థం చేసుకోవాలో..?!