Manchu Manoj: రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మనోజ్!

మంచు మనోజ్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు ఈయన ఈ ఏడాది రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా వృత్తిపరమైనటువంటి జీవితంపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ విధంగా మంచు మనోజ్ త్వరలోనే ఉస్తాద్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఈ టీవీ ఛానల్ లో ప్రసారం కాబోతోంది.

ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు ఈయనను రాజకీయాల గురించి ప్రశ్నలు వేశారు. గత ఎన్నికలలో మీ కుటుంబం మొత్తం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ పార్టీకే మద్దతు తెలిపారు మరి ఈసారి కూడా మీరు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంచు మనోజ్ సమాధానం చెబుతూ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదని తెలిపారు. నేను కేవలం మా నాన్నకు మాత్రమే సపోర్ట్ చేశానని ఈయన సమాధానం చెప్పారు.

గతంలో మీరు మీ తండ్రికి సపోర్ట్ చేశారు. అయితే ఈసారి మీ నాన్న వైఎస్ఆర్సిపి పార్టీని సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీ భార్య టిడిపి పార్టీని సపోర్ట్ చేస్తున్నారు ఈ సమయంలో మీరు తండ్రిని సపోర్ట్ చేస్తారా లేక మీ భార్యను సపోర్ట్ చేస్తారా అంటూ ప్రశ్న వేశారు. తాను ఇప్పటివరకు నేను ఈ పార్టీకే ఓటు వేయండి అంటూ ఎవరికీ చెప్పలేదు నాకు సంబంధించి నా సర్కిల్లో ఉన్నవారు ఎలక్షన్స్ లో నిలబడితేనే వారికి సపోర్ట్ చేశానని తెలిపారు.

ఇక ఇప్పుడు తండ్రికి సపోర్ట్ చేస్తారా భార్యకు సపోర్ట్ చేస్తారా అంటే నేను నా భార్య ఎలక్షన్స్ లో స్టాండ్ తీసుకొని విన్ అవుతాను అంటే నేను తప్పకుండా తనకే సపోర్ట్ చేస్తాను అంటూ తన భార్య మౌనిక రెడ్డికి మద్దతు తెలియజేశారు. ఇక మోహన్ బాబు వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేయగా మనోజ్ భార్య మౌనిక రెడ్డి ఫ్యామిలీ టిడిపి పార్టీ అనే విషయం మనకు తెలిసిందే. ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె ఈ మౌనిక రెడ్డి కావడంతో ఈయన తన (Manchu Manoj) భార్యకు మద్దతు తెలియజేస్తాను అంటూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus