Manchu Manoj, Mounika: మౌనిక ఫస్ట్ మ్యారేజ్ కి గెస్ట్ గా వెళ్లిన మనోజ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..!

మంచు మనోజ్, భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత రెండు,మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి వినాయకుడికి పూజలు చేయడం.. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది.గతంలో మంచు మనోజ్ కు ప్రణతి రెడ్డితో పెళ్లి జరిగింది.కానీ కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకున్నాడు.ఇక మౌనిక రెడ్డి కూడా సేమ్ టు సేమ్.

గతంలో ఆమె కూడా పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిపోయింది. 2015 లో మౌనిక రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కో- ఇన్సిడెన్స్ అనుకోవాలో ఏమో కానీ ఈమె మొదటి పెళ్ళికి మంచు మనోజ్ కూడా హాజరయ్యాడు. మౌనిక మొదటి పెళ్లికి అతిథిగా వెళ్లిన మంచు మనోజ్ ఇప్పుడు ఆమెనే రెండో పెళ్లి చేసుకోబోతుండడం, ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి కావడం విడ్డూరంగా ఉంది అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆ రకంగా ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. మరోపక్క వీరి వివాహానికి మంచు మోహన్ బాబు అంగీకరించలేదు అనేది ఇన్సైడ్ టాక్. అందుకే మనోజ్ కూడా చాలా కాలంగా కుటుంబానికి దూరంగా.. మౌనిక రెడ్డితో కలిసుంటున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టినా.. మౌనిక రెడ్డి మొదటి పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus