Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Manchu Vishnu: ‘మా’ ఎన్నికలు.. విష్ణు దిగొచ్చాడుగా..!

Manchu Vishnu: ‘మా’ ఎన్నికలు.. విష్ణు దిగొచ్చాడుగా..!

  • July 12, 2021 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: ‘మా’ ఎన్నికలు.. విష్ణు దిగొచ్చాడుగా..!

‘మా’ ఎన్నికల గురించి మంచు విష్ణు తాజాగా ఓ లేఖ రాసారు. ఈ లేఖ ద్వారా ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. విష్ణు మాటల్లో …

అందరికి నమస్కారం,

నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. పూర్వం మద్రాసులో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం నటులకి కలిపి ఒక్క నడిగర్ సంఘం మాత్రమే వుండేది. మన తెలుగు సినీ నటీనటులకి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా వుంటూ చాలా మంచి పనులు చేస్తూ ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ని అద్భుతంగా నడిపారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్ రావడం, 1993లో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ని అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నాన్నగారు, చిరంజీవి గారు మరికొంతమంది పెద్దలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారు ‘మా’ పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నారు.

1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మన సినీ కార్మికులకి నివాసం కల్పిద్దాం అని ఒక స్థలాన్ని కేటాయించింది. 1997లో దాన్ని ఒక పెద్ద రాజకీయ నాయకుడు తన ఫ్యాక్టరీ కోసం సొంతం చేసుకుందామని ప్రయత్నిస్తే, నాన్న గారికి ఆ విషయం తెలిసి సినీ కార్మికుల తరుపున అప్పటి గవర్నర్ రంగరాజన్ గారిని కలిసి ఒక పిటిషన్ సబ్మిట్ చేసి ఆ స్థలాన్ని సినీ కార్మికులకి చెందేలా చేసారు. అదే ఇప్పుడు మనకున్న చిత్రపురి కాలనీ.

ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబం గానీ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులకు ప్రాబ్లమ్స్ వస్తే పోలిస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం జరిగింది. Ex: వాళ్ళు న్యాయంగా కొన్న భూమిని కొంతమంది లాక్కుంటే, దానికోసం పోలిస్ స్టేషన్ కి వెళ్ళి పోరాడి న్యాయం చేయించాం. కుడి చెయ్యి చేసే దానం ఎడం చేతికి తెలియకూడదు అంటారు.. అందుకే వాళ్ళ పేర్లు చెప్పదల్చుకోలేదు.

2015లో దాసరి నారాయణ రావు గారు, మురళీ మోహన్ గారు ఇద్దరు కలిసి నన్ను ప్రెసిడెంట్ గా ఉండమని అడిగితే, ఆరోజు నాన్నగారు అడ్డుపడి ఇప్పుడే ఈ వయసులో ఎందుకు అని నన్ను వద్దని గురువు గారికి సర్దిచెప్పారు.

ఇంతకు ముందు ఉన్న మురళీ మోహన్ గారు, నాన్న గారు, నాగబాబు గారు, రాజేంద్రప్రసాద్ గారు, శివాజీ గారు మంచి పనులు చేశారు. ప్రస్తుతం ఉన్న నరేష్ గారైతే Corona Pandemic లో కష్టాల్లో ఉన్న ఎంతో మంది తోటి ఆర్టిస్ట్ లకి అండగా నిలబడి వాళ్ళకి ఇన్సూరెన్స్ లు, పెన్షన్స్ లాంటివే కాకుంటే, తన సొంత డబ్బులు కూడా ఇచ్చి ఎంతోమందికి హెల్ప్ చేశారు. ఇలా ప్రతి ప్రెసిడెంట్ మన MAA Members కోసం ఎంతో నిస్వార్ధంగా కృషి చేసారు.

MAA Association లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావు అని అనుకుంటున్నా. మనం గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్ళి మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం.

నా బ్రదర్ సునీల్ నటుడిని ఒక సందర్భంలో కలిసినప్పుడు నాకొక మాట చెప్పాడు. ‘ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు గారిని కలువు, ఆయన నీకు హెల్ప్ చేస్తారు’ అని తోటి నటీనటులు చెప్పారని, అలానే నాన్న గారిని కలిసానని, సమస్య పరిష్కారం అయ్యిందని చెప్పాడు.

ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలి… మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ గా ఉండి, నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కి అటెండ్ అయిన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ “MAA Association” కోసం కట్టించబోయే బిల్డింగ్ కి అయ్యే మొత్తం ఖర్చులో 25 శాతం నేను, నా కుటుంబం ఇస్తాము అని చెప్పాను. 10-12 ఏళ్ళుగా ఆ బిల్డింగ్ కట్టాలని అందరు అంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా జరిగే ప్రతి ‘MAA’ ఎలక్షన్స్ అదే ప్రధాన అజెండాగా వినిపిస్తుంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. ‘MAA’ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తాను.. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్ ని నేను నిర్మిస్తాను.. మన దృష్టిలో అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాదు. బిల్డింగ్ కావాలని అందరు కోరుకుంటున్నారు.. కట్టేద్దాం.. DONE… ఆ టాపిక్ కి ఇక ఫుల్స్టాప్ పెడదాం.

ఇక మన సినీ ఆర్టిస్ట్స్ ఫేస్ చేస్తున్న రియల్ ఇష్యూస్ మీద మనం దృష్టి పెడదాం. ప్రజెంట్ మన మూవీ ఇండస్ట్రీ గోల్డెన్ ఫేజ్ వైపు నడుస్తుంది. ఎన్నో కొత్త కొత్త OTTs, సినిమాలు, యూట్యూబ్ ఛానల్స్ అంటూ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒకచోట పని దొరుకుతుంది. మన ఇండస్ట్రీలో ఉన్న 24 CRAFTS లో వాళ్ళ వాళ్ళ యూనియన్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళే సినిమాల్లో పని చేయాలి, కానీ ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నదేమిటంటే.. మెంబర్షిప్ లేని చాలామంది పనిచేస్తున్నారు. మెంబర్షిప్ ఉన్నవారికి పని లేదు. కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేద్దాం.. తప్పులేదు.. కానీ సినిమాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు MAA మెంబర్ అవ్వాల్సిందే.. ఇది FIRST RULE.. ఇలా expand అయిన మన ‘MAA’ ఫ్యామిలీ మెంబర్స్ అందరు గురించి ఒక brochure తయారు చేసి ప్రతి ప్రొడక్షన్ హౌస్, OTTS కి పంపి మన మెంబర్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని కోరాలి. ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి ‘MAA Association’కి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉండాలి. భారతదేశంలో ఉన్న అన్ని సినీ అసోసియేషన్స్ తో మన ‘MAA’ గట్టి సంబంధాలు కలిగి ఉండాలి.. మనం విస్తరించాలి. MAA Association బలపడాలి, మనమంత నిర్మాతలకు సహకరించాలి. నిర్మాతలు లేకపోతే మనం లేము.. ఇది ప్రతి నటుడు గుర్తుంచుకోవాల్సిన విషయం.

manchu vishnu Shocks IT officers1

నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే.. ఇండస్ట్రీ పెద్దలు అయిన కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, సత్యనారాయణ గారు, నాన్న గారు, మురళీమోహన్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, జయసుధ గారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, రాజేంద్రప్రసాద్ గారు, కోట శ్రీనివాస్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు కూర్చుని ‘MAA’ కుటుంబాన్ని నడిపించడానికి వాళ్ళే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధం. పెద్దలను గౌరవిస్తాం.. వాళ్ళ సలహాలు పాటిస్తాం.. మా యంగర్ జనరేషన్ ని ఆశీర్వదించి.. ‘MAA’ ప్రెసిడెంట్ గా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ…..

మీ బిడ్డ..
విష్ణు మంచు

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hema
  • #jeevitha
  • #MAA Elections
  • #manchu vishnu

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

51 mins ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

2 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

3 hours ago

latest news

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ రైటర్ మృతి!

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ రైటర్ మృతి!

55 mins ago
‘లెవన్’ చూసిన ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు, ట్విస్ట్ లు మైండ్ బ్లోయింగ్ గా వుంటాయి: హీరో నవీన్ చంద్ర

‘లెవన్’ చూసిన ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు, ట్విస్ట్ లు మైండ్ బ్లోయింగ్ గా వుంటాయి: హీరో నవీన్ చంద్ర

56 mins ago
Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

5 hours ago
HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

5 hours ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version