Manchu Vishnu: కన్నప్ప రిలీజ్ పై మంచు విష్ణు క్లారిటీ ఇదే.. ఏమన్నారంటే?

  • January 16, 2024 / 10:29 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో ఒకరైన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తుండగా ఎన్నో ప్రత్యేకతలతో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. తాజాగా మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చారు.

కన్నప్ప మూవీ ఈ ఏడాదే విడుదలవుతుందని అయితే రిలీజ్ డేట్ గురించి మాత్రం చెప్పలేనని మంచు విష్ణు అన్నారు. కన్నప్ప మూవీ షూటింగ్ 60 శాతం ఇప్పటివరకు పూర్తైందని ఫిబ్రవరి నెల నుంచి మిగతా భాగం షూట్ జరగనుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్ లో మిగతా భాగం షూట్ ను పూర్తి చేస్తామని ఆయన కామెంట్లు చేశారు. ప్యాచ్ వర్క్ మాత్రం ఇండియాలో షూట్ చేస్తామని విష్ణు వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి సమయానికి కన్నప్ప మూవీ షూట్ దాదాపుగా పూర్తవుతుందని వెల్లడించారు. తన ఫ్యామిలీతో కలిసి మంచు విష్ణు భోగి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు కొడుకు నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఈ సినిమా రిజల్ట్ విషయంలో మంచు విష్ణు పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఇతర భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుండగా ఇతర భాషల్లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. మంచు విష్ణు కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు మంచు విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కన్నప్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ సాధించాలన్న (Manchu Vishnu) మంచు విష్ణు కల నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus