Manchu Vishnu: పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రముఖ హీరో, మా అధ్యక్షుడు అయిన మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా పలు హిట్లు అందుకున్న ఇతను.. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథాంశంతో కూడుకున్న సినిమాలు చేస్తున్నారు. మరోపక్క మా అధ్యక్షుడిగా అలాగే శ్రీ విద్యానికేతన్ స్కూల్ అలాగే కళాశాల ఛైర్మెన్ గా ఇతను కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. మంచు విష్ణు ఏం మాట్లాడినా.. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది.

తాజాగా ఇతను పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. (Manchu Vishnu)  మంచు విష్ణు మాట్లాడుతూ.. ” పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మనా? పవన్ సినిమాల గురించి అయితే చెప్పగలను. సినిమా ఇండస్ట్రీలో పవన్ ఒక సూపర్ స్టార్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పవన్‌ కళ్యాణ్ నటించిన సినిమాలు ఒకటి ఆడకపోయినా.. నెక్స్ట్ వచ్చిన సినిమా బాగుంటే భారీ కలెక్షన్స్ సాధిస్తుంది.

అయితే రాజకీయాల సంగతి వేరు. ఆ విషయంలో జనాలు చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తారు. సినిమాల విషయంలో నచ్చిన వాళ్ల సినిమా వస్తే చూస్తారు. కానీ ఎలక్షన్స్ లో ఓటు వేసే ముందు నచ్చిన నాయకుడికే ఓటేస్తారు. సినిమా రంగంలో అత్యద్భుతంగా రాణించిన వారు సైతం రాజకీయాలను సరిగ్గా అంచనా వేయలేక బోల్తా పడిన సందర్భాలు ఉన్నాయి.ఏ నాయకుడు అయితే తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన జీవితాన్ని బాగు చేస్తారని నమ్ముతారో.. వారికే ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus