Manchu Vishnu, Prakash Raj: ‘మీరు నాకు రిప్లై ఇవ్వకండి’ అంటూ ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు మెసేజ్..!

నిన్న జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యానెల్ అన్ని విభాగాల్లోనూ ఘ‌న విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నిక‌ల అనంతరం ప్రకాష్ రాజ్, నాగ‌బాబు లు… తమ ‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి హాట్ టాపిక్ అయ్యారు.ముఖ్యంగా ప్రకాష్ రాజ్ …. త‌న‌ని ‘మా’ స‌భ్యులు నాన్ లోక‌ల్‌గానే పరిగణిస్తున్నారని… అందుకే ఓట్లు వేయ‌లేద‌ని, ఇలాంటి ఎజెండా ఉన్నఅసోసియేష‌న్‌లో తాను కలవలేనని.. చెప్పి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అలా అని స‌భ్యుడు కాక‌పోయినా అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ఇత‌ర న‌టీట‌నుల‌కు సాయం చేయడానికి తాను సిద్ధమేనని, తెలుగు సినిమాల్లో న‌టిస్తూనే ఉంటానని కూడా తెలిపారు. ఇక ‘మా’ అధ్య‌క్షుడైన మంచు విష్ణుకి త‌న రాజీనామాను తెలియ‌జేస్తూ ఓ మెసేజ్ కూడా పెట్టారు ప్రకాష్ రాజ్. అంతేకాదు విష్ణు ప్యానెల్‌కు అభినంద‌న‌లు కూడా తెలిపారు. అయితే ప్ర‌కాష్ రాజ్ మెసేజ్ పై విష్ణు స్పందిస్తూ…”మీ అభినంద‌న‌లకు కృతజ్ఞుడను. అయితే మీరు రాజీనామా చేయడం పై నేను సంతోషంగా లేను.

మీరు నాకంటే పెద్ద‌వారు. గెలుపోట‌ములు అనేవి నాణానికి రెండు వైపులూ ఉండేటువంటివి. వీటిలో దేనిని ఎలా స్వీక‌రించాలో మీకు కూడా తెలుసు.దయచేసి మీరు ఎమోష‌న‌ల్‌గా ఆలోచించొద్దు. మీరు ‘మా’ కుటుంబంలో ఓ భాగం. మీ ఆలోచ‌న‌లు మాకు కావాలి. మ‌నం ఎప్పుడూ క‌లిసి ప‌నిచేద్దాం. ఇప్పుడు మీరు నాకు రిప్ల‌య్ ఇవ్వ‌నవసరం లేదు. త్వ‌ర‌లో మిమ్మల్ని క‌లిసి మాట్లాడుతాను. ద‌య‌చేసి తొంద‌ర‌ప‌డ‌కండి’’ అంటూ చెప్పుకొచ్చారు విష్ణు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus