‘హీరోల’ పై విష్ణు సంచలన కామెంట్స్!!!

మంచు వారి వారసుడు హీరో విష్ణు ఈ మధ్య వివాదాలకు ఎక్కువగా వేదికగా మారుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే…తాజాగా విష్ణు నటించిన ‘ఈడోరకం-ఆడో రకం’ సినిమా భారీ హిట్ కావడంతో కాస్త నోరు జారుతున్నాడు విష్ణు అన్న టాక్ ఇండస్ట్రీ లో బలంగా వినిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది అంటే…ఆ మధ్య సినిమా విడుదల అయినప్పుడు ప్రమోషన్ లో భాగంగా విష్ణు మాట్లాడుతూ ఇప్పుడున్న దర్శకులపై విమర్శలు గుప్పించాడు.

తనకు అసెంబ్లీ రౌడీ, జగదేకవీరుడు అతిలొక సుందరి వంటి సినిమాలు చెయ్యాలని ఉంది అని, కానీ అలాంటి కధలను రచించే వారే లేరు అని కాస్త ఘాటుగానే తెలిపాడు. ఇక దీనిపై ఇండస్ట్రీలో విమర్శలు వెల్లువెత్తాయి. అదంతా మరచిపోతున్నారు అన్న క్రమంలో మరోసారి విష్ణు చేసిన వ్యాఖలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విష్ణు మాట్లాడుతూ…డైరక్టర్లు ఎలా ఆడిస్తే తాము అలా ఆడుతున్నామని. ఏ సినిమాకైనా కష్టపడటం ఒకేలానే ఉంటుంది అంటూ డైరక్టర్లు పై షాకింగ్ కామెంట్స్ చేసాడు మంచు విష్ణు. సినిమా రంగంలో ఎవరు ఎంత కష్టపడినా లక్ అనేది కూడా ఉంటుందని అది కూడా కలిసి వస్తేనే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని కామెంట్స్ చేసాడు విష్ణు. ఒక డైరెక్టర్ తాను చెప్పాలనుకున్న స్టోరీలైన్ 15 నుండి 20 నిమిషాల్లో చెప్పాలి కాని కొందరు ఏకంగా రెండు గంటలు చొప్పున స్టొరీ లైన్ చెపుతూ ఎందుకు కథ వినేవారి మైండ్ బ్లాంక్ చేస్తారో తనకు అర్ధం కావడం లేదు అంటూ సెటైర్లు వేసాడు విష్ణు. అసలు విష్ణు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాదో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. బహుశా హిట్ వచ్చిన ఆనందంలో విష్ణు ఇలా మాట్లాడుతున్నాడేమొ అన్న విమర్శలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags