Manchu Vishnu: మాటలతో రానివారికి… టికెట్లు ఇచ్చి మరీ తెచ్చారా…!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఎందుకు గెలిచాడు అంటే… చాలా రకాల సమాధానాలు వస్తాయి. అందులో ఓటర్ల మొబిలైజేషన్‌ ఒకటి అని గట్టిగా చెప్పొచ్చు. ‘మా’లో సభ్యత్వం ఉండి… దూర ప్రాంతాల్లో ఉన్నవారి విషయంలో మోహన్‌బాబు – మంచు విష్ణు చాలా ప్లాన్సే వేశారు. వారిని ఆ రోజు హైదరాబాద్‌ రప్పించి… ఓటు హక్కు వినియోగించుకునేలా చూసుకున్నారు. అయితే దీని కోసం గట్టిగానే ఖర్చయించి అంటున్నారు.

సాధారణ ఎన్నికలను తలపించేలా ఈ ఎన్నికల్లో పోలింగ్‌ సాగింది. సాధారణ ఎన్నికల్లో అయితే… ఎక్కడో ఉద్యోగం కోసం దూరంగా ఉన్నవారికి టికెట్లు తీసి ఇచ్చి మరి ఓటింగ్‌కి రమ్మంటుంటారు. ఇప్పుడు విష్ణు కూడా అలాంటి పనే చేశాడు అంటున్నారు. ఈ విషయంలోనే ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోయారు అని అంటున్నారు కూడా. బయట రాష్ట్రాల నుండి హైదరాబాద్‌ వచ్చి ఓట్లు వేసిన వారికి విమాన టికెట్లు, హోటళ్లు… ఇలా సుమారు ₹20 లక్షలు ఖర్చు పెట్టారని టాక్‌.

ఇది కాకుండా… రెండు ప్యానళ్లు లంచ్‌ మీటింగ్‌లు, డిన్నర్‌ మీటింగ్‌లు పెట్టాయి. సుమారు ఏడు సార్లు ఈ మీటింగ్‌లు జరిగాయి. ఎంత కాదన్నా… ఒక్కో మీటింగ్‌కి ₹ఆరు నుండి ₹8 లక్షలు ఖర్చయి ఉంటుంది. ఆ లెక్కన అదొక సుమారు₹60 లక్షలు. మిగిలిన ఖర్చులు, వాహనాలు అన్నీ మరో ₹20 లక్షలు వరకు అయ్యుంటాయని టాక్‌. దీంతో మొత్తం ఈ ఎన్నికల కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేశారని టాక్‌. ఈ ఎన్నికలకు అంత అవసరమా అంటే ప్రెస్టీజ్‌ ఇష్యూగా తీసుకున్నారు మరి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus