మంచు విష్ణు (Manchu Vishnu) అందరికీ సుపరిచితమే. మోహన్ బాబు (Mohan Babu) కొడుకుగా మాత్రమే కాదు.. హీరోగా కూడా అతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఢీ’ (Dhee) ‘దేనికైనా రెడీ’ (Denikaina Ready) ‘దూసుకెళ్తా’ (Doosukeltha) ‘ఈడోరకం ఆడోరకం’ (Eedo Rakam Aado Rakam) వంటి హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ‘కన్నప్ప’ (Kannappa) అనే భారీ బడ్జెట్ సినిమా నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. విష్ణు భార్య విరానికా కూడా అందరికీ సుపరిచితమే. తాజాగా ఆమె మెయింటెనెన్స్ గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
విరానికా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” నాకు బ్యాగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఇంకోరకంగా పిచ్చి అని కూడా అనుకోవచ్చు. నా దగ్గర లక్షల్లో విలువ చేసే బ్యాగ్స్ ఉన్నాయి. అందులో ఒక బ్యాగ్ విలువ ఏకంగా రూ.32 లక్షలు. అంతేకాదు నా దగ్గర 200 కి పైగా బ్యాగ్స్ ఉన్నాయి. అంత ఇష్టం నాకు బ్యాగ్స్ అంటే..! వాటిపైనే కాదు షూస్ వంటి వాటిపై కూడా నేను ఎక్కువగా ఖర్చు పెడతాను” అంటూ చెప్పి షాకిచ్చింది.
హీరోయిన్స్ కూడా లక్షలు విలువ చేసే బ్యాగ్స్ వాడుతూ ఉంటారు. సమంత (Samantha) , నయనతార (Nayanthara), కాజల్ (Kajal Aggarwal) వంటి హీరోయిన్లు రూ.3 లక్షలు విలువ చేసే బ్యాగ్స్ వాడుతున్నారు. కానీ విరానికా ఏకంగా రూ.32 లక్షలు విలువ చేసే బ్యాగ్ వాడుతుంది అంటే చిన్న విషయం కాదు. విరానికా పెద్దింటి కోడలుగానే కాదు ‘న్యూయార్క్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తోంది. అలాగే పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేస్తుంది. అందుకే ఆ రేంజ్ మెయింటెనెన్స్ అనమాట.