సీనియర్ నటుడు రఘుబాబు (Raghu Babu) అందరికీ సుపరిచితమే. గిరిబాబు (Giri Babu) కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టినా.. అతనిలాగే కామెడీ అలాగే విలక్షణ పాత్రలతో స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా వేడుకల్లో ఈయన ఎక్కువగా మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు కోపంతో ఊగిపోయారు. విషయం ఏంటంటే నిన్న హైదరాబాద్లో ‘కన్నప్ప’ (Kannappa) ప్రమోషన్స్ కోసం ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ వేడుకలో భాగంగా ఓ రిపోర్టర్..”మొదటి నుండి మీరు ఏం మాట్లాడినా చాలా తెలివిగా మాట్లాడతారు.
కానీ కొంతమంది ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని రెడీగా ఉంటారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ప్రభాస్ గారి బాడీ మీ బాడీ గురించి కంపేర్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు తప్పుబడుతూ ట్రోల్ చేశారు.దానికి సంబంధించిన వీడియోను కూడా బాగా వైరల్ చేశారు. సో దాని గురించి క్లారిటీ ఏమైనా ఇద్దామనుకుంటారా? లేక లైట్ తీసుకుంటారా?’ అంటూ మంచు విష్ణుని (Manchu Vishnu) ప్రశ్నించాడు. అందుకు మంచు విష్ణు..
“ఒక ఇంటర్వ్యూలో ఒక సెంటెన్స్ తీసుకుని.. దాన్ని కట్ చేసి.. వైరల్ చేసి.. కాంట్రోవర్సీ చేస్తున్నాం… అని అనుకుంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజుల్లో ప్రజలు కూడా అలాంటి వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. అసలు ఆ సెంటెన్స్ ఎక్కడ వస్తుంది అని వీడియో మొత్తం చూసి..
వాళ్ళు కావాలని విషయం లేని దాన్ని కాంట్రోవర్సీ చేస్తున్నారు అని గ్రహిస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పక్కనే ఉన్న రఘుబాబు మైక్ తీసుకుని.. “ఈ సినిమా(కన్నప్ప) గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే.. చెబుతున్నా ఇప్పుడే.. ‘శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు.. గుర్తుపెట్టుకోండి’..! ఎవ్వరైనా సరే ట్రోల్ చేస్తే ఇక వాళ్ళు ఫినిష్” అంటూ చెప్పుకొచ్చాడు.