ఈ మధ్య సినిమా వేడుకల్లో సీనియర్ హీరోలు లేదా ఆర్టిస్టులు మైక్ పట్టుకుంటే చాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది సినిమా యూనిట్లకు కూడా నచ్చడం లేదు. మొన్నటికి మొన్న చిరంజీవి(Chiranjeevi) .. బ్రహ్మానందంని (Brahmanandam) ఉద్దేశిస్తూ ‘ఎర్రి మొహం పెట్టుకుని చూసేవాడు’ అనడం. అటు తర్వాత 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) ‘లైలా’ (Laila) సినిమా వేడుకలో కాంట్రవర్సియల్ కామెంట్స్ చేయడం. ఆ తర్వాత టీం సారీ చెబుతూ ఓ ప్రెస్ మీట్ పెట్టడం. ఇక రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఒక సినిమా వేడుకలో ‘ఎర్రచందనం దొంగ వాడు హీరో’ అంటూ ‘పుష్ప’ (Pushpa) గురించి నెగిటివ్ గా మాట్లాడటం.. ఇలాంటి సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా నిర్వహించిన ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమా వేడుకలో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మరోసారి నోరు జారారు. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ.. “40 ఏళ్ళ నుండి సినీ పరిశ్రమలో ఉన్నాను. ఇప్పటికీ ఇలా ఉండటానికి కారణం మీరు(ప్రేక్షకులు). ‘మైత్రి మూవీ మేకర్స్’ నా సొంత కంపెనీ లాంటిది. రవి (Y .Ravi Shankar), నవీన్ (Naveen Yerneni) నాకు సొంత బిడ్డలు లాంటివాళ్ళు. వీళ్ళ బ్యానర్ స్టార్ట్ అయ్యింది ‘శ్రీమంతుడు’ (Srimanthudu) సినిమాతో..! అందులో నేను అతి ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ చేశాను. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కి (Vennela Kishore) నాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తాయి.
ప్రతి ఇంట్లోనూ రాబిన్ హుడ్ లాంటి దొంగ ఉండాలి అనుకునే విధంగా దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమా తీశాడు. నితిన్ (Nithiin)నా బిడ్డ లాంటివాడు. శ్రీలీల (Sreeleela) కూడా బాగా చేసింది. వెంకీ- మైత్రి..ల వల్ల ఈ సినిమాలో నటించిన మేమంతా బాగా దగ్గరయ్యాం” అంటూ అక్కడి వరకు బాగానే మాట్లాడారు. కానీ ఆ తర్వాత ‘ వెంకీ (Venky Kudumula) – నితిన్ కలిసి ఈ సినిమా కోసం డేవిడ్ వార్నర్ ని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ ఆడవయ్యా..
అంటే ఇలా డాన్సులు(‘పుష్ప’ లో శ్రీవల్లి స్టెప్) వేస్తున్నాడు. దొంగ ము*డా కొడుకు మామూలోడు కాదండీ ఈడు. ఏయ్.. రేయ్ వార్నరు.. D వార్నింగ్’ చాలా దారుణంగా మాట్లాడారు రాజేంద్రప్రసాద్. అతని కామెంట్స్ ని నెటిజన్లు వ్యతిరేకిస్తూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ‘తాగేసి వచ్చి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావా?’ ‘అంత వయసొచ్చింది.. పరాయి దేశస్థులు మన దేశం వస్తే వాళ్ళతో ఎలా మసులుకోవాలో తెలీదా? లేక తెలుగు రాదని అతన్ని అలా బూతులు తిడుతున్నావా?’ అంటూ తిట్టిపోస్తున్నారు.