Kannappa: ‘కన్నప్ప’ డిసెంబర్ కి రాదట.. మంచు విష్ణు క్లారిటీ !

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమా నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తుంది. బాలీవుడ్లో సీరియల్స్ డైరెక్ట్ చేసే ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ‘అవా ఎంటర్టైన్మెంట్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థలపై స్వయంగా మంచు విష్ణు భారీ బడ్జెట్..తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna), బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి స్టార్ రైటర్స్ ‘కన్నప్ప’ కథపై వర్క్ చేయడం జరిగింది.

Kannappa

వాస్తవానికి ఇవేవీ కూడా ‘కన్నప్ప’ కి స్పెషల్ అట్రాక్షన్ కాదు. కానీ మోహన్ లాల్ (Mohanlal) , అక్షయ్ కుమార్ (Akshay Kumar), శివరాజ్ కుమార్(Shiva Rajkumar).. వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. వీళ్లందరి కంటే ముఖ్యంగా ప్రభాస్ (Prabhas)  ఈ చిత్రంలో అతిధి పాత్ర పోషిస్తున్నాడు. ‘కన్నప్ప’ కి సెల్లింగ్ పాయింట్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. గ్లింప్స్ లో కూడా ప్రభాస్ కళ్ళు హైలెట్ అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఓ ఫోటో కూడా ఇంటర్నెట్లో లీక్ అయ్యి తెగ వైరల్ అయ్యింది.

ఇదిలా ఉండగా.. ‘కన్నప్ప’ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో డిసెంబర్ 20 ఆ టైంకి ఈ సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ డిసెంబర్లో ‘కన్నప్ప’ రిలీజ్ కావడం లేదు వాయిదా పడింది అనేది లేటెస్ట్ న్యూస్. స్వయంగా మంచు విష్ణునే ఈ విషయంపై అధికారికంగా స్పందించాడు.

ఈరోజు తిరుమలకి వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మంచు విష్ణు.. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ‘కన్నప్పని డిసెంబర్లో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరడం లేదు. దీంతో 2025 సమ్మర్ కి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

ప్రభాస్ హీరోయిన్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన గెటప్ శీను!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus