Mangalavaaram First Review: ‘మంగళవారం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘ఆర్. ఎక్స్.100 ‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘మంగళవారం’. ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నవంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో నవంబర్ 16 నుండే పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మల్టీప్లెక్సుల్లో నవంబర్ 16 నైట్ నుండి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబడతాయి. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి చూపించడం జరిగింది. వారి కోసం వేసిన స్పెషల్ షోకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. వారి టాక్ ప్రకారం.. సినిమా (Mangalavaaram) ప్రారంభమైన అరగంట తర్వాత పాయల్ పాత్ర ఎంటర్ అవుతుందట.

అప్పటి వరకు క్రియేట్ చేసిన సస్పెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కట్టి పారేయడమే కాకుండా సెల్ ఫోన్లు కూడా చూడకుండా చేస్తాయని చెబుతున్నారు. ఆ తర్వాత కొంత డ్రామా నడిచినా ఇంటర్వెల్ బ్లాక్ లో ఒక షాకింగ్ ఎపిసోడ్ తో ఎండ్ అయ్యి.. సెకండాఫ్ పై క్యూరియాసిటీని పెంచుతుందట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్లో ఉంటాయట. అలాగే అప్పటివరకు ఊహించని విధంగా క్లైమాక్స్ డిజైన్ చేశాడట దర్శకుడు.

కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నా.. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వడంతో నెగిటివ్ కామెంట్స్ చేసే విధంగా లేవు అని తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ(ముఖ్యంగా కొన్ని విజువల్స్), బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకు వచ్చినా వెంటాడతాయి అని తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమా కచ్చితంగా అలరిస్తుంది అని, ముఖ్యంగా బి,సి సెంటర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది అని అంటున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus