‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో రూపొందిన మరో క్రేజీ మూవీ ‘మంగళవారం’. ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నవంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఓపెనింగ్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి. కానీ రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ తగ్గాయి. మూడో రోజు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వల్ల మరింతగా తగ్గుతాయి అనుకున్నా.. కొంత వరకు బెటర్ గానే పెర్ఫార్మ్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
2.10 cr
సీడెడ్
0.78 cr
ఉత్తరాంధ్ర
0.65 cr
ఈస్ట్
0.38 cr
వెస్ట్
0.26 cr
గుంటూరు
0.32 cr
కృష్ణా
0.20 cr
నెల్లూరు
0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.58 cr
వరల్డ్ వైడ్ టోటల్
5.41 cr
‘మంగళవారం’ (Mangalavaaram) చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12.5 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.5.41 కోట్ల షేర్ ను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ మరో రూ.7.09 కోట్లు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చిన్నది కాదు. పైగా ఈ వారం కూడా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ‘మంగళవారం’ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.