Mangalavaaram: బుల్లితెరపై కూడా హిట్ అయిన ‘మంగళవారం’.. ఎంత టి.ఆర్.పి వచ్చిందో తెలుసా?

‘ఆర్ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో ‘మంగళవారం’ అనే థ్రిల్లింగ్ మూవీ వచ్చింది. నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. వరల్డ్ కప్ సీజన్ కాకుండా వేరే సీజన్లో రిలీజ్ అయ్యుంటే… ఇంకా ఎక్కువగా కలెక్షన్ల వర్షం కురిపించి ఉండేది ఈ మూవీ అనడంలో సందేహం లేదు.

ఓటీటీల్లో కూడా ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇప్పుడు టీవీల్లో కూడా సక్సెస్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇటీవల ‘మంగళవారం’ సినిమాని ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ చేయగా.. ఇక్కడ కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని సక్సెస్ అందుకుంది. ఫిబ్రవరి 18 న ఈ మూవీ ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అవ్వగా.. మొదటిసారి టెలికాస్ట్ కే 8.3 టి.ఆర్.పి రేటింగ్ ని నమోదు చేసింది.

ఈ మధ్య కాలంలో టీవీల్లో మొదటిసారి టెలికాస్ట్ అయ్యే పెద్ద సినిమాలకి కూడా ఇలాంటి రేటింగ్ రావడం కష్టంగా ఉన్న ఈ తరుణంలో ‘మంగళవారం’ ఈ రేంజ్ రేటింగ్ ను నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ‘మంగళవారం’ (Mangalavaaram) చిత్రాన్ని ‘ముద్ర మీడియా’ వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus