Mani Sharma: ఎన్టీఆర్ కోసం ట్యూన్స్ కాఫీ కొట్టాను: మణిశర్మ

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మణిశర్మ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అయితే ఈయనకు అవకాశాలు లేకపోవడంతో దూరంగా ఉంటున్నాను అంటూ ఇదివరకు పలు సందర్భాలలో వెల్లడించారు. ఇకపోతే తాజాగా మణిశర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో పాతవారికి అవకాశాలు లేకుండా చేస్తున్నారని తనకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అంటూ మణిశర్మ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

తమన్ దేవి శ్రీ ప్రసాద్ కి ఇచ్చిన విధంగా తనకు కూడా అవకాశం ఇవ్వాలని ఈయన తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కొన్ని ట్యూన్స్ కాపీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా కాపీ గురించి ఈయనకు కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు మణిశర్మ సమాధానం చెబుతూ ఏ కంపోజర్ కూడా ఒక ట్యూన్ కాపీ కొట్టాలి అని అనుకోరు. ఏదైనా కానీ ఒరిజినల్ ఇవ్వాలని కోరుకుంటారు. మరి మీరు ఎప్పుడైనా కాపీ కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా అంటూ ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు మణిశర్మ (Mani Sharma) సమాధానం చెబుతూ తాను ఎన్టీఆర్ ఆది సినిమాలోని చికి చికి బం బం అని పాటను టర్కీ పాట ట్యూన్ కాఫీ చేశానని, నాకు ఇలా కాపీ చేయడం ఇష్టం లేకపోయినా బలవంతంగా నాతో చేయించారు అంటూ ఈ సందర్భంగా మణిశర్మ చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అది ఒక పాటకు తప్ప నేను ఎక్కడ ఏది కాపీ చేయలేదని ఈయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus