Manjima Mohan: బాడీ షేమింగ్ కామెంట్స్ పై స్పందించిన మంజిమా.. ఏమన్నారంటే?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ తాజాగా పెళ్లి చేసుకోగా మంజిమా గురించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ ట్రోల్స్ గురించి మంజిమా మోహన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. పర్సనల్ లైఫ్ పై ట్రోల్స్ ప్రభావం చూపవని ఆమె తెలిపారు. అవసరం అనుకుంటే నేను బరువు తగ్గడానికి సిద్ధమేనని మంజిమా పేర్కొన్నారు.

మా మ్యారేజ్ సమయంలో కూడా కొంతమంది నా బరువు గురించి నెగిటివ్ కామెంట్లు చేశారని ఆమె అన్నారు. ట్రోల్స్ నాకు కొత్త కాదని గతంలో కూడా నాపై ట్రోల్స్ వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నా శరీరంతో నేను సౌకర్యవంతంగా ఉన్నానని మంజిమా మోహన్ అన్నారు. నేను కోరుకున్న సమయంలో నేను బరువు తగ్గ గలనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను నాతో సంతోషంగా ఉన్నానని నేను ఫిట్ నెస్ లో ఉన్నానని మంజిమా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వృత్తిపరమైన నిబద్ధతతో బరువు తగ్గాలని భావించిన సమయంలో బరువు తగ్గడం నాకు కష్టం కాదని ఆమె కామెంట్లు చేశారు. నేను లావుగా ఉన్నంత మాత్రాన ఇతరులకు సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదని మంజిమా మోహన్ పేర్కొన్నారు. మంజిమా మోహన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని మంచి కథ దొరికితే త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని ఆమె అన్నారు.

మంజిమా మోహన్ స్పందన నేపథ్యంలో ఇకనైనా ట్రోల్స్ ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆమె మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus