Manju Warrier: సౌత్ ఇండియాలో మారుమ్రోగుతున్న మంజు పేరు.. వరుస ఆఫర్లు పక్కా!

మంజు వారియర్ కు (Manju Warrier) ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా సౌత్ ఇండియా అంతటా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వేట్టయన్ (Vettaiyan) సినిమాలోని సాంగ్ లో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో మంజు వారియర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మనసిలయో సాంగ్ లో ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులను ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. మంజు వారియర్ లుక్స్ ను చూస్తే ఆమె వయస్సు 46 సంవత్సరాలు అంటే నమ్మశక్యం కాదు.

Manju Warrier

మలయాళ బ్యూటీ మంజు వారియర్ తన ప్రతిభతో అంతకంతకూ ఎదుగుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో ఆమె బిజీ అవుతున్నారు. అయితే విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమాలో మంజు వారియర్ కు హీరోయిన్ గా ఛాన్స్ దక్కిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. హెచ్.వినోద్ (H Vinoth) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా విజయ్ చివరి సినిమా కావడం, ది గోట్ (The Greatest of All Time) మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఇప్పటికే చాలా పేర్లు ప్రచారంలోకి రాగా ఇలాంటి సమయంలో మంజు వారియర్ పేరు వినిపించడం కొసమెరుపు. తుణివు మూవీలో నటించే సమయంలోనే దర్శకుడు వినోద్ తనకు మరో సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారని ఆమె వెల్లడించారు. మంజు వారియర్ కామెంట్ల నేపథ్యంలో ఆమెకు విజయ్ సినిమాలో ఛాన్స్ దక్కిందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మంజు వారియర్ సినిమాల పాత్రల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంజు వారియర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. సోషల్ మీడియాలో సైతం ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫలితాల విషయంలో బాధ పడ్డారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus