మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డు వసూళ్లతో రూ. 200 కోట్లు అందుకున్న సినిమా ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోనూ రాబోతోంది. అక్కడ రూ. 200 కోట్ల సినిమా అంటే.. అది ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) అని ఈజీగా చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆ ఫీట్ సాధించిన ఏకైక సినిమా అదే కాబట్టి. ఫిబ్రవరి 22న తొలుత కేరళలో థియేటర్లలో విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మెల్లగా పక్క రాష్ట్రాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసింది.
దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ తీసుకు రావాలని డిమాండ్లు పెరిగాయి. ఇదిగో అదిగో అని ఆ మధ్య వినిపించినా… అవ్వలేదు. అయితే ఎట్టకేలకు ముగ్గురు పెద్ద నిర్మాతలు కలసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అవును తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) , ‘హను – మాన్’ (Hanu Man) నిర్మాత నిరంజన్ రెడ్డి కలసి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఏప్రిల్ 6న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
దీంతో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), – మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) – పరశురామ్ (Parasuram) – దిల్ రాజుల (Dil Raju) సినిమా ‘ఫ్యామిలీ స్టార్’కి (Family Star) సరైన పోటీ లేదు అనుకుంటున్న తరుణంలో మేమున్నాం అంటూ ‘మంజుమ్మెల్ బాయ్స్’ వచ్చేస్తున్నారు. అయితే కొందరు ఈ పోటీని దిల్ రాజు వర్సెస్ మైత్రీ మూవీ మేకర్స్ అని కూడా అంటున్నారు. 2006లో జరిగిన యదార్థ సంఘటన నుండి ప్రేరణ పొంది ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను తెరకెక్కింఆరు. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొడువల్ దర్శకత్వం వహించారు.
కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు తమిళనాడులోని కొడైకెనాల్ ట్రిప్ వేస్తారు. అక్కడి ‘గుణ’ సినిమా కేవ్స్ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అవుతారు. అది నిషేధిత ప్రాంతమని చెప్పినా వినిపించుకోకుండా వెళ్తారు. ఆ గ్యాంగ్ లో ఓ సభ్యుడు ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. అతనిని కాపాడుకోవడానికి ఆ కుర్రాళ్లు ఏం చేశారు అనేద కథ.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్