నాగార్జున టార్గెట్ చాలా ఈజీ..!

అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మధుడు2’. ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ‘వియాకామ్ మోషన్ పిక్చర్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగష్టు 9 న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి స్పందన లభించడంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

‘మన్మధుడు2’ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 7.0 కోట్లు
సీడెడ్ – 2.5 కోట్లు


ఆంధ్ర (టోటల్) – 7.0 కోట్లు
————————————————
తెలంగాణ + ఏపీ (టోటల్) – 16.5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.60 కోట్లు


ఓవర్సీస్ – 2.40 కోట్లు
——————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 20.50 కోట్లు
——————————————————

వైజాగ్ మరియు కృష్ణా ఏరియాల్లో నాగార్జున ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వీకెండ్ తో పాటు ఆగష్టు 12, ఆగష్టు 15 సెలవు రోజులని కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ‘సాహో’ వంటి క్రేజీ చిత్రాన్ని ఆగష్టు 15 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు… ‘మన్మధుడు2’ ని ఆగష్టు 9 విడుదల అని అనౌన్సు చేయడం బట్టే నాగార్జున కి ఈ చిత్రం పై ఉన్న నమ్మకాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ నమ్మకం ఎంత బలమైనదో తెలియాలంటే ఆగష్టు 9 వరకూ వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus