వెలిగిపోతున్న షారుఖ్‌ ‘మన్నత్‌’.. సెల్ఫీలే సెల్ఫీలు!

హీరోలకు ఫ్యాన్స్‌ వాళ్ల ఇళ్లకు ఫ్యాన్సే. తెలుగులో ఈ ట్రెండ్‌ తక్కువ కానీ.. బాలీవుడ్‌లో ఎక్కువే అని చెప్పాలి. ఇదిగో అమితాబ్‌ బచ్చన్‌ ఇల్లు, ఇదిగో షారుఖ్‌ ఖాన్‌ ఇల్లు, ఇదిగో సల్మాన్‌ ఖాన్‌ ఇల్లు అంటూ ఆ ఇంటితో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి ముచ్చటపడిపోతుంటారు. అలా గత రెండు రోజులుగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ ఇల్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దానికి కారణం ఆ ఇంటి నేమ్‌ ప్లేట్‌.

ఇప్పటికే అర్థమైపోయుంటుంది మేం ఎవరి గురించి చెబుతున్నామో. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ గురించే ఇదంతా. ముంబయి సందర్శనకు వెళ్లినవాళ్లు కచ్చితంగా బాంద్రాలో ఉన్న మన్నత్‌ను చూడాలనుకుంటారు. వెస్ట్‌ బాంద్రాలో ఉన్న ఈ షారుఖ్‌ ఖాన్‌ ఇంటిని దూరం నుండి చూసినా చాలు అనుకుంటూ ఉంటారు. అలాంటి ఇంటికి కొన్ని రోజుల క్రితం డైమండ్‌ నేమ్‌ ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆ రోజుల్లో ఆ గేట్‌ ముందు దిగి సెల్ఫీలు, వీడియోలు దిగారు అభిమానులు.

ఆ తర్వాత ఆ నేమ్‌ ప్లేట్‌ తీసేశారు. అయితే ఇప్పుడు షారుఖ్‌ ఫ్యామిలీ మళ్లీ ఆ నేమ్‌ ప్లేట్‌ను తీసుకొచ్చింది. దీంతో మరోసారి కింగ్ ఖాన్‌ ఇంటి ముందు సందడి వాతావరణం నెలకొంది. వజ్రాల నేమ్‌ ప్లేట్‌ తిరిగి వచ్చాక.. షారుఖ్‌ ఖాన్‌ కలల సౌధం అందం మరింత రెట్టింపైందనిఇ అభిమానులు అంటున్నారు. సుమారు రూ.35 లక్షలు పెట్టి తన ఇంటికి వజ్రాల నేమ్‌ప్లేట్‌ పెట్టించారు షారుఖ్‌.

అయితే అప్పుడు పెట్టిన వారంలోపే ఆ నేమ్‌ ప్లేట్‌లోని ఒక వజ్రం కనిపించకుండా పోయింది. దీంతో నేమ్‌ ప్లేట్‌ను గేట్‌ దగ్గర నుండి తీసేశారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆ వజ్రం ఇంటిలోని తోటలో కనిపించడంతో తిరిగి నేమ్‌ ప్లేట్‌ను యథావిధిగా అమర్చేశారు. షారుక్‌ ఇంటికి బ్రాండ్‌గా నిలిచిన ఈ నేమ్‌ ప్లేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus