మనోజ్ ఇంటి మొదలైన పెళ్లి సందడి… నేడు ఘనంగా సంగీత్ వేడుక!

  • March 2, 2023 / 05:02 PM IST

మంచు మనోజ్ రెండో సారి పెళ్లి కొడుకుగా మారిపోయారు.గత కొంతకాలంగా ఈయన భూమా మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉంటూ రహస్యంగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. అయితే వీరి రిలేషన్ బయటపడటంతో వీరిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని అందరూ భావించారు. ఇలా మనోజ్ మార్చి మూడవ తేదీ మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది.

ఇలా మార్చి మూడవ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కానున్న మనోజ్ మౌనిక ఇంట ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇక మనోజ్ పెళ్లి వేడుకలు అన్నీ కూడా మంచు లక్ష్మి ఇంట ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన లక్ష్మీ మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లికి మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు దూరంగా ఉన్నట్టు సమాచారం.మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి వీరిద్దరూ ఈ పెళ్లికి దూరంగా ఉండడంతో మంచు లక్ష్మి తన తమ్ముడి పెళ్లి బాధ్యతలను తీసుకొని పెళ్లి వేడుకలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే లక్ష్మి ఇంట మనోజ్ పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి నిన్న మెహందీ హల్దీ వేడుకలలో పాల్గొన్నటువంటి మంచు కుటుంబం నేడు సంగీత్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నారు. ఇలా హల్దీ మెహందీ సంగీత వేడుకలలో మంచు ఫ్యామిలీ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈ జంటకు ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం.ఇదివరకే వీరిద్దరూ వీరి జీవిత భాగ్య స్వాములకు విడాకులు ఇచ్చి తిరిగి రెండో పెళ్లి ద్వారా వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus