Mansoor Ali Khan: త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీ ఖాన్.. ఇప్పటికైనా మారాడా?
- November 24, 2023 / 09:10 PM ISTByFilmy Focus
త్రిష మన్సూర్ అలీ ఖాన్ వివాదం సౌత్ ఇండియా అంతటా సంచలనం అయిన సంగతి తెలిసిందే. మొదట తన తప్పును అంగీకరించని మన్సూర్ అలీ ఖాన్ వివాదం పెద్దది కావడంతో ఎట్టకేలకు ఒక మెట్టు దిగి త్రిషకు క్షమాపణలు చెప్పాడు. త్రిషకు క్షమాపణలు చెబుతూ మన్సూర్ అలీ ఖాన్ పోస్ట్ పెట్టారు. త్రిషపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. తాను చేసిన కామెంట్లు సరదాగా చేసిన కామెంట్లు అని ఆ కామెంట్లను సీరియస్ గా తీసుకోవద్దని చెప్పుకొచ్చారు.
త్రిష పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలని తాను భావిస్తున్నానని మన్సూర్ అలీ ఖాన్ వెల్లడించారు. మన్సూర్ క్షమాపణలు చెప్పడంతో ఆయన క్షమాపణల గురించి త్రిష కూడా స్పందించారు. తప్పు చేయడం మానవ సహజమని క్షమాపణ అత్యున్నతమైనదని త్రిష కామెంట్లు చేశారు. జాతీయ మహిళా కమిషన్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే మన్సూర్ అలీ ఖాన్ పై కేసు కూడా నమోదు కావడం గమనార్హం.

మొదట త్రిషకు క్షమాపణలు చెప్పనని చెప్పిన మన్సూర్ అలీ ఖాన్ చివరకు వెనక్కు తగ్గారు. మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో కేసును వెనక్కు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది. మన్సూర్ అలీ ఖాన్ కు కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనవసర వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వడం మన్సూర్ అలీ ఖాన్ కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) కెరీర్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. మన్సూర్ అలీ ఖాన్ ఇకపై వివాదాలకు దూరంగా ఉంటే ఆయన కెరీర్ కు మంచిదని చెప్పవచ్చు. మన్సూర్ అలీ ఖాన్ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!













