Aamir Khan: ‘లాల్ సింగ్ చద్దా’కి పోటీగా వస్తోన్న సినిమాలు!

ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా వస్తోందంటే.. ఎవరూ పోటీకి సిద్ధపడరు. అందులోనూ.. ఆయన ఒక్కో సినిమాకి రెండు, మూడేళ్లు గ్యాప్ ఇస్తారు కాబట్టి ఆయన సినిమాలకు పోటీగా ఎవరూ రారు. కానీ ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’కు సోలో రిలీజ్ ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

‘లాల్ సింగ్ చద్దా’ టీమ్ ఈ డేట్ ని చాలా రోజుల క్రితమే బుక్ చేసుకుంది. అయినా కూడా అక్షయ్ అండ్ టీమ్ ఈ డేట్ ని లాక్ చేసుకున్నారు. అక్కడ వ్యవహారం అలా ఉంటే మనదగ్గర మరోలా ఉంది. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నాగచైతన్య ఉండడంతో సినిమాకి హిట్ టాక్ వస్తే.. సౌత్ లో కూడా వసూళ్లు బాగా వస్తాయని ఆశించిన నిర్మాతలకు తిప్పలు తప్పేలా లేవు.

ఆగస్టు 11న విక్రమ్ నటిస్తోన్న ‘కోబ్రా’ సినిమా రిలీజ్ కానుంది. తమిళనాడులో అత్యధిక థియేటర్లను ఈ సినిమా ఆక్యుపై చేస్తుంది. తెలుగులో కూడా ఎక్కువ సినిమాలు అదే సమయానికి విడుదల కానున్నాయి. ఒక రోజు గ్యాప్ తో ఆగస్టు 12న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, సమంత ‘యశోద’, విశాల్ ‘లాఠీ’ రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు చాలవన్నట్లు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న ‘స్వాతిముత్యం’ని ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాను సితార సంస్థ నిర్మిస్తుండడంతో ఎగ్జిబిటర్స్ తో ఇబ్బంది ఉండదు. కానీ ఇన్ని సినిమాలు ఒకేరోజు వస్తే థియేటర్స్ ను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ కావడంతో అన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి ఆ సమయానికి ఏదైనా సినిమా డ్రాప్ అవుతుందేమో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus