Chiranjeevi: కాజల్, నయన్, చిరు.. ఈ కో-ఇన్సిడెన్స్ చూశారా..నెక్స్ట్ టార్గెట్ ఆమేనా..!

కొన్ని కొన్ని విషయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. గతంలో తమన్నాతో కలిసి ఏ హీరో అయినా నటిస్తే ఆ హీరోకి పెళ్ళైపోతుంది అని అనుకునే వారు. ఈ విషయం ‘రచ్చ’ టైం లో తమన్నా కూడా అంది. చరణ్, ఎన్టీఆర్, కార్తీ వంటి హీరోలు ఆ టైములో పెళ్లి చేసుకున్నారు. అలాగే రానాకు జోడీగా చేసినా హీరోయిన్లకి కూడా పెళ్ళైపోయింది అని కొన్నాళ్ళు అన్నారు.ఒక్క జెనీలియా విషయంలో తప్ప ఇంకెవ్వరి విషయంలో ఇలా జరగలేదు.

ఇప్పుడు మరోసారి ఇలాంటి సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో లాజిక్ ఏమీ లేదు. అతిశయోక్తి మాత్రమే అనుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి సరసన రెండో సారి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్లకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్ల విషయంలో ఇది నిజమయ్యింది. చిరంజీవి సరసన ‘ఖైదీ నెంబర్ 150’ లో నటించిన తర్వాత ‘ఆచార్య’ సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకుంది కాజల్. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఆమెకు పెళ్లైపోయింది.

ఆచార్య రిలీజ్ అయ్యే టైమ్ కు ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.కానీ ఆ సినిమాలో ఆమె పార్ట్ తీసేసారు అనుకోండి అది వేరే విషయం.ఇక ఇప్పుడు నయనతార విషయంలో కూడా ఇదే జరుగుతుంది.చిరంజీవి సరసన ‘సైరా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది నయనతార. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ లో కూడా నటించడానికి ఓకే చెప్పింది.అయితే ఈమెకి కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. విఘ్నేష్ శివన్- నయన్ లు చాలా కాలం నుండీ ప్రేమలో ఉన్నారు.

మొత్తానికి ఇప్పుడు అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి… తమన్నా పై పడింది. తమన్నా ఆల్రెడీ చిరుకి జోడీగా ‘సైరా’ లో నటించింది. వీళ్ళ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది కానీ దానిని తొలగించారు. ఇప్పుడు చిరుతో రెండో సారి భోళా శంకర్ లో నటిస్తుంది. కాబట్టి ఈమెకు కూడా పెళ్ళైపోతుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ జరిగితే ఈ సెంటిమెంట్ బలపడుతుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus