Akhanda 2: బాలయ్య అఖండ2 మూవీలో విశ్వక్ సేన్ నిజంగానే నటిస్తారా?

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ (Ahanda) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అఖండ సక్సెస్ సాధించడంతో అఖండ సీక్వెల్ అంతకు మించి హిట్ కావడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్యను అభిమానించే యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ (Vishwak Sen) ముందువరసలో ఉంటారు. అయితే అఖండ సీక్వెల్ లో విశ్వక్ సేన్ ముఖ్య పాత్రలో నటిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Akhanda

వాస్తవానికి విశ్వక్ సేన్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ కు ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో నటించడం కరెక్ట్ కాదు. అఖండ సీక్వెల్ లో విశ్వక్ సేన్ నటిస్తున్నారనే వార్తకు సంబంధించి అటు చిత్రయూనిట్ నుంచి కానీ ఇటు విశ్వక్ సేన్ నుంచి కానీ అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే లేదనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో సినిమాలలో మరో క్రేజ్ ఉన్న హీరో నటిస్తున్నట్టు వార్తలు రావడం ఎక్కువగా జరుగుతోంది.

అయితే ఈ వార్తల్లో నిజాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అఖండ2 (Akhanda 2) సినిమాలో పాత్ర మరీ అద్భుతంగా ఉంటే మాత్రం విశ్వక్ సేన్ సినిమాను రిజెక్ట్ చేయవద్దని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. అఖండ సీక్వెల్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. అఖండ సీక్వెల్ 2025లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ సీక్వెల్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 ‘ఆయ్’ డైరెక్టర్ కావాలనే ఆ సీన్ పెట్టి బాలయ్యపై సెటైర్లు వేశాడా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus