AAY: ‘ఆయ్’ డైరెక్టర్ కావాలనే ఆ సీన్ పెట్టి బాలయ్యపై సెటైర్లు వేశాడా!

ఎన్టీఆర్ (Jr NTR)  బావమరిది నార్నె నితిన్ (Narne Nithin)  హీరోగా తెరకెక్కిన ‘ఆయ్’ (AAY)   సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ‘డబుల్ ఇస్మార్ట్’  (Double iSmart) ‘తంగలాన్’  (Thangalaan)  వంటి పెద్ద సినిమాల నడుమ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. ఓటీటీలో ఇంకా పెద్ద హిట్ అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.

AAY

వివరాల్లోకి వెళితే.. ‘ఆయ్’ లో ఓ సీన్ బాలయ్య (Balakrishna) అభిమానులకు కోపం తెప్పించిందట. ఆ సీన్ ఏంటంటే.. ‘అమలాపురం వెంకట్రామా థియేటర్లో ‘ఆదిత్య 369 ‘ సినిమా ప్రదర్శిస్తున్నట్లు, బాలయ్య అభిమానిగా హీరోయిన్ తండ్రిని(విలన్..ని) చూపించారు. వెంకట్రామా థియేటర్లో దుర్గని కొట్టినవాడే లేడు అంటూ అతని పాత్రని ఎలివేట్ చేశారు. అయితే క్లైమాక్స్ లో.. ‘అలాంటి దుర్గనే కొట్టిన ఏకైక మగాడు’ అంటూ హీరో ఫాదర్ అడబాల బురయ్య (వినోద్ కుమార్) (Vinod Kumar) ని చూపించారు.

వినోద్ కుమార్ పాత్ర బ్యాక్ గ్రౌండ్లో చిరంజీవి కటౌట్ కూడా కనిపిస్తుంది. అంటే బాలయ్య రికార్డులను తుక్కు తుక్కు చేసే ఏకైక హీరో చిరంజీవి (Chiranjeevi) అని పాజిటివ్ గా అర్ధం చేసుకోవచ్చు. కానీ పై డైలాగ్ ని ఇంకా పొడిగిస్తూ ‘ అలా ఇలా కాదు కుక్కను కొట్టినట్లు కొట్టాడు’ అంటూ పలికించడం అనేది బాలయ్య ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది.

మెగా ఫ్యామిలీకి చెందిన బ్యానర్లో రూపొందిన సినిమా కాబట్టి..ఇలాంటి డైలాగ్ ఉందనుకోవడంలో తప్పులేదు. కానీ ఎన్టీఆర్ బావమరిది సినిమాలో బాలయ్యని అవమానిస్తూ ఇలాంటి డైలాగ్ పెట్టడం ఏంటి అనేది వారిని ఎక్కువగా నిప్పిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus