ఇటీవల కాలంలో హీరోలు కలిసి నటిస్తే ఆ సినిమాలకు వస్తున్న బజ్ అంతా ఇంతా కాదు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ నాలుగు ఉన్నా కూడా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నారు. ఇక ఇద్దరు హీరోల్లో ఒకరు నెగిటివ్ పాత్రలో కనిపిస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. విజయ్ సేతుపతి కూడా ఇటీవల మాస్టర్ సినిమాతో నెగిటివ్ పాత్రతో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విలన్ పవర్ఫుల్ గా ఉంటేనే హీరో రేంజ్ అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది.
మాస్టర్ సినిమాలో విజయ్ పాత్ర కంటే ఎక్కువగా సేతుపతి పాత్రనే హైలెట్ అయ్యింది. ఒక విధంగా తెలుగు ఆడియెన్స్ కు అతని పాత్రనే ఎక్కువగా నచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. మాస్టర్ సినిమా ప్రభావం ఇప్పుడు సలార్ పై పడ్డట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా విజయ్ సేతుపతిని విలన్ గా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఫిక్స్ అవ్వలేదు గాని ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యేలా ఉన్నారని టాక్. ఒకవేళ అతన్ని ఫిక్స్ చేస్తే మాత్రం సినిమాపై అంచనాలు మరో లెవెల్లో ఉంటాయి.
మాస్టర్ సినిమాలో విలన్ పాత్ర కంటే హై వోల్టేజ్ తో సలార్ లో కనిపించాలి. అప్పుడే సినిమా క్లిక్కవుతుంది. KGF లాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ కు యాక్షన్ డోస్ పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. విలన్స్ ను కూడా పవర్ఫుల్ గా చూపిస్తాడు కాబట్టి విజయ్ సేతుపతి లాంటి నటుడు దొరికితే ఊహాలకందని రేంజ్ లో చూపించడం కాయం. ఇక దాదాపు KGF సినిమాకు పని చేసిన వారే సలార్ సినిమాకు పని చేయబోతున్నారు. మరి సలార్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!