‘మాస్టర్’ అమెజాన్ ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైన విజయ్ ‘మాస్టర్’ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే విజయ్ మరియు విజయ్ సేతుపతి అభిమానులు మాత్రం ఈ చిత్రం చూడడానికి ఎగబడ్డారు.అందులోనూ 2019 లో ‘ఖైదీ’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం.. పైగా సంక్రాంతి పండుగ కూడా కలిసిరావడంతో.. మొదటివారం ‘మాస్టర్’ కలెక్షన్లు అదిరిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రం కొన్న బయ్యర్లు అంతా ఆల్రెడీ సేఫ్ అయిపోవడమే కాకుండా లాభాలను కూడా అందుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం అతి త్వరలో అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతుందనేది తాజా సమాచారం. అందుతోన్న సమాచారం ప్రకారం ‘మాస్టర్’ డిజిటల్ రైట్స్ ను ‘అమెజాన్ ప్రైమ్’ వారు భారీ రేటు పెట్టి కొనుగోలు చేశారట. ఈ నేపథ్యంలో వేలంటైన్స్ డే వీకెండ్ స్పెషల్ గా ఫిబ్రవరి 12 న అమెజాన్ ప్రైమ్‌లో ‘మాస్టర్’ చిత్రం విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది.ఫిబ్రవరి ఎలాగూ సినిమాలకు డ్రై సీజన్ అంటుంటారు.

ఈ నెలలో జనాలు ఎక్కువగా థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు కూడా.! అందుకే ఆ టైములో ‘మాస్టర్’ ను విడుదల చేస్తే మంచి వ్యూయర్ షిప్ నమోదయ్యే అవకాశం ఉందని అమెజాన్ ప్రైమ్ వారు భావిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి అమెజాన్ వారి ప్లానింగ్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో..!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus