Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 13, 2021 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం “మాస్టర్”. “ఖైదీ” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు. విడుదలైన పాటలు, టీజర్ వీరలెవల్లో హైప్ తీసుకురావడంతో.. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు,తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఈమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: జెడి (విజయ్) ఓ కాలేజ్ మాస్టర్. తాను చదివిన కాలేజ్ లోనే మాస్టర్ కావడంతో స్థాన బలం చూసుకుని ఇష్టవచినట్లు ప్రవర్తిస్తుంటాడు. తాగి కాలేజ్ కి రావడం మొదలుకొని కాలేజ్ లో స్తూడెంట్ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడంతో కాలేజ్ లెక్చరర్స్ & ప్రిన్సిపాల్ అందరూ జెడిని ఇష్టపడరు. కాలేజ్ ఎలక్షన్స్ లో గొడవల కారణంగా జేడీని కాలేజ్ నుంచి 3 నెలలు బయటకి పంపిస్తారు. కట్ చేస్తే.. చిన్నప్పుడే చేయని తప్పుకి జైల్లో ఖైదీలా పెరిగిన భవాని (విజయ్ సేతుపతి), పెరిగిన వాతరవరణాన్ని బేస్ చేసుకొని పెద్ద రౌడీగా ఎదుగుతాడు. 18 ఏళ్ల లోపు పిల్లల చేత హత్యలు, దొంగతనాలు చేయించి వాళ్లకి శిక్ష తక్కువ అనే క్రిమినల్ లాజిక్ తో రాజకీయాల్లోకి కూడా వెళ్లాలని ప్లాన్ వేస్తుంటాడు.

అయితే.. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తప్పుకున్న జెడి జువెనైల్ హోమ్ కి మాస్టర్ గా వస్తాడు. అక్కడ భవాని & దాస్ కలిసి చేస్తున్న దారుణాలను ఎలా ఎదుర్కొన్నాడు? జెడి వెర్సస్ భవానిలో ఎవరిది పైచేయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: విజయ్ కంటే ముందు విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకోవాలి. భవాని పాత్రను రాసిన విధానం, ఆ క్యారెక్టర్ ను విజయ్ సేతుపతి ఓన్ చేసుకొని పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన విధానం ఆడియన్స్ కు కిక్ ఇస్తుంది. జెడి కంటే భవాని క్యారెక్టర్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. విజయ్ సేతుపతి – విజయ్ ల కాంబినేషన్ లో క్లైమాక్స్ ఫైట్ తప్ప వేరే సన్నివేశాలు లేకపోవడం అనేది విజయ్ కి మంచిది అయ్యింది. ఎందుకంటే.. ఎక్కువ సీన్స్ ఉంటె విజయ్ సేతుపతి పూర్తిగా డామినేట్ చేసేసేవాడు. అతడి క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా అదిరింది. “ధ్రువ”లో అరవింద స్వామి తర్వాత పర్ఫెక్ట్ గ్రాఫ్ & క్యారెక్టర్ ఆర్క్ ఉన్న పాత్ర భవాని.

విజయ్ నటనలో కొత్తదనం అనేది పెద్దగా కనిపించలేదు. గెటప్ కాస్త మారింది కానీ, నటుడిగా వేరియేషన్స్ చూపించాల్సిన అవసరం చాలా ఉందని విజయ్ ఇప్పటికైనా గ్రహించాలి. ఇంకా అవే ఎలివేషన్ సీన్స్, అదే బద్ధకం యాక్టింగ్, అవే మ్యానరిజమ్స్ ను కంటిన్యూ అనేది ఫ్యాన్స్ ను సంతృప్తిపరుస్తుంది కానీ.. కామన్ ఆడియన్స్ ను కాదు అనేది విజయ్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. మాళవిక మోహనన్ ను రెండు సీన్స్ కు, ఒక యాక్షన్ సీక్వెన్స్ & ఒక పాటకు మాత్రమే పరిమితం చేశారు. అర్జున్ దాస్ తన పాత్రకు న్యాయం చేసాడు.

సాంకేతికవర్గం పనితీరు: సాధారణంగా సినిమాకి మూడు నాలుగు పాటలు ఇచ్చి సిచ్యుయేషన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సరిపెట్టేస్తారు సంగీత దర్శకులు. అనిరుద్ మాత్రం ఈ చిత్రంలో ప్రతి సందర్భానికి ఒక పాట ఇచ్చేసాడు. ఒక్కోసారి వచ్చేది పాటో, బ్యాగ్రౌండ్ స్కోరో అర్ధం కాదు. సినిమాకి మెయిన్ ఎస్సెట్ లో ఒకడిగా నిలిచాడు అనిరుధ్. అయితే.. అనిరుధ్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందనే చెప్పాలి. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, లైటింగ్ పరంగా తీసుకొన్న జాగ్రత్తలతోపాటు.. క్యారెక్టర్స్ బట్టి కెమెరా యాంగిల్స్ ను సెట్ చేసుకొని ఒక రెగ్యులారిటీ మైంటైన్ చేసిన విధానం బాగుంది. ఇక దర్శకుడు-రచయిత లోకేష్ కనగరాజన్ గురించి మాట్లాడుకుందాం. మనోడి మొదటి సినిమా “మానగరం” తెలుగులో “నగరం”కు తమిళంలో భీభత్సమైన టాక్ వస్తే.. తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. అయితే.. రెండో సినిమా “ఖైదీ” మాత్రం వీరలెవల్లో ఆడేసింది. ఆ సినిమాను అతడు తీసిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. అందుకే ఆ సినిమాను ఇప్పుడు అజయ్ దేవగన్ హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు.

అలంటి లోకేష్ ఏకంగా విజయ్ తో సినిమా తీస్తున్నాడంటే అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం. అంచనాలను మించుతాడు అనుకుంటే.. అందుకోవాలనే ఆత్రంతో చేసిన కొన్ని తప్పులతో బొక్కబోర్లా పడ్డాడు. లోకేష్ దర్శకుడిగా, కథకుడిగా రెండు రకాలుగా ఫెయిల్ అయ్యాడు. కథ కంటే అనవసరమైన ఎలివేషన్స్ ను ఎక్కువగా నమ్ముకున్నాడు. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం కోసం కథలో ఇరికించిన సన్నివేశాలు, అవసరం లేని ఎలివేషన్స్ గట్రా దర్శకుడిగా అతడి ప్రతిభకు తుప్పు పట్టించాయి. లోకేష్ పొటెన్షియల్ అనేది సినిమాలో ఎక్కడా కనిపించలేదు. ప్రీక్లైమాక్స్ లో వచ్చే లారీ సీక్వెన్స్ ను మరీ కామెడీగా తీసాడు. “ఖైదీ” యాక్షన్ బ్లాక్స్ ను దగ్గరుండి సహజంగా తీయించిన అదే దర్శకుడు ఈ రోత యాక్షన్ సీన్స్ తీసాడు అంటే నమ్మడం కష్టం. అన్నిటికీ మించి మూడు గంటల నిడివి సినిమాకి పెద్ద మైనస్. సినిమాలో కంటెంట్ ఉంటే ఆడియన్స్ చూస్తారు కానీ.. అనవసరమైన ఎలివేషన్స్ ను అంతసేపు కూర్చుని ఎవరు చూస్తారు. లోకేష్ ఇకనైనా కథ కోసం హీరో కానీ.. హీరో కోసం కథ కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి.

విశ్లేషణ: తమిళంలో సోలో రిలీజ్, అక్కడ విజయ్ పెద్ద స్టార్ కాబట్టి యావరేజ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావచ్చేమో కానీ.. తెలుగులో ఆల్రెడీ రవితేజ “క్రాక్” బంపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండగా, రేపు “రెడ్” విడుదలవుతుండగా “మాస్టర్” ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకోవడం అనేది కష్టమే. ముఖ్యంగా ఇలాంటి యావరేజ్ కంటెంట్ తో పాన్ ఇండియన్ రిలీజ్ అనేది ఆరంభ సూరత్వమే అవుతుంది తప్పితే విజయాన్ని అందుకోలేదని విజయ్ కి ఘనంగా చాటి చెప్పే సినిమా ఇది. సో, విజయ్ కి వీరాభిమానులు మాత్రమే ఓపికతో చూసి ఎంజాయ్ చేయదగిన సినిమా “మాస్టర్”. అలాగని మిగతా జనాలు చూడలేరు అని కాదు కానీ.. ఓపిక కావాలి.

రేటింగ్: 2.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Lokesh Kangaraj
  • #malavika mohanan
  • #Master
  • #Master Movie

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

13 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

26 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version