‘విశ్వం’ సినిమాతో పర్వాలేదనిపించినా, వింటేజ్ శ్రీను వైట్ల మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ లోటు తీర్చడానికి ఈ దర్శకుడు ఇప్పుడు శర్వానంద్ తో జతకట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా సంస్థ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉండటంతో అంచనాలు బాగున్నాయి. అయితే ఇందులో క్యాస్టింగ్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
Sharwanand
వైట్ల సినిమాల్లో స్పెషల్ రోల్స్, గెస్ట్ క్యారెక్టర్లు ఎంత ఫన్నీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు శర్వానంద్ సినిమాలోనూ అలాంటి ఒక కీలక పాత్రను డిజైన్ చేశారట. ఆ పాత్ర కోసం ఒక ప్రముఖ మలయాళ హీరోని రంగంలోకి దించుతున్నట్లు టాక్. ఆ క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా, నవ్వించే బాధ్యత మొత్తం ఆ స్టార్ హీరోపైనే ఉంటుందట.
ఇక హీరోయిన్ గా అనంతిక సనీల్ కుమార్ ను ఫైనల్ చేశారు. ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ సినిమాల్లో తన క్యూట్ నెస్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు శర్వా సరసన ఛాన్స్ కొట్టేసింది. వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద ఫ్రెష్ గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే మరో సీనియర్ హీరో కూడా ఈ కథలో భాగం కాబోతున్నారట.
కథ విషయానికి వస్తే.. తెలియని వయసులో ఆవేశంతో చేసిన ఒక చిన్న తప్పు, హీరో జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అనే పాయింట్ చుట్టూ ఈ డ్రామా నడుస్తుంది. కామెడీతో పాటు ఎమోషన్ కు కూడా స్కోప్ ఉన్న కథ ఇది. ఈ ఏడాది చివర్లోనే షూటింగ్ మొదలుపెట్టి, నాన్ స్టాప్ గా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారైనా శ్రీను వైట్ల తన బ్రాండ్ కామెడీతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తారో లేదో చూడాలి.