మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లిమ్ప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఒకటి ‘మీసాల పిల్లా’. ఇంకోటి ‘శశిరేఖ’ అనే పాట.
‘సంక్రాంతికి వస్తున్నాం’ కి సూపర్ మ్యూజిక్ అందించిన భీమ్స్ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’కి కూడా సంగీతం అందిస్తున్నాడు. అయితే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ నుండి విడుదలైన 2 పాటలు కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ టెంప్లేట్ నే ఫాలో అయ్యి రూపొందినట్టు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ సినిమా పాటల రేంజ్లో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ పాటలకి ఆడియన్స్ వైబ్ అవ్వడం లేదు.

‘మీసాల పిల్లా’ పాటని తీసుకుంటే.. అది ‘గోదారి గట్టుమీద’ ఫ్లేవర్లోనే రూపొందినట్టు అనిపిస్తుంది. కానీ దాని రేంజ్లో హమ్ చేసుకునే విధంగా ఈ పాట లేదు. కానీ మెల్ల మెల్లగా ఈ పాట కూడా వైరల్ అయ్యింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను కొల్లగొట్టి పాస్ మార్కులు వేయించేసుకుంది. ఇక ‘శశిరేఖ’ విషయానికి వస్తే.. ఇది ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ‘మీను’ తరహా పాటలా అనిపిస్తుంది. కానీ ఆ పాటలా… ఈ పాట వినసొంపుగా లేదు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ మాత్రం బాగున్నాయి. సో వినగా వినగా ఎక్కుతుందేమో కానీ.. ఇన్స్టెంట్ గా మాత్రం ఎక్కే సాంగ్ కాదిది.
