‘మిస్టర్ బచ్చన్’ తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్సే(Bhagyashree Borse). డెబ్యూ మూవీనే పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి. వెంటనే ఆమెకు విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. నాగవంశీ నిర్మించిన ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంతా భావించారు. ఆ సినిమాలో డాక్టర్ రోల్ పోషించింది భాగ్య శ్రీ.
కానీ ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘కాంత’ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఆమె బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. భాగ్య శ్రీలో ఇంత గొప్ప నటి ఉందా అని అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. తర్వాత వెంటనే రామ్ కి జోడీగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ అయ్యింది. ఇందులో భాగ్య శ్రీ లుక్స్ తో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది.

కానీ ఆమె బ్యాడ్ లక్.. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.చేసిన 4 సినిమాలు ప్లాప్ అయితే ఏ హీరోయిన్ ఇమేజ్,క్రేజ్ అయినా పడిపోతాయి. కానీ భాగ్య శ్రీ కి మాత్రం ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆమె ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న ‘లెనిన్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ‘మైత్రి’ బ్యానర్లోనే మరో సినిమా చేసేందుకు సైన్ చేసిందట. హీరో ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
అలాగే తమిళంలో కూడా ఓ పెద్ద ప్రాజెక్టులో నటించబోతుంది భాగ్య శ్రీ. ఇవి కనుక హిట్ అయితే ఆమె దశ తిరిగినట్టే.
