‘గుంటూరు కారం’ నుండి ఇప్పటికే ‘దమ్ మసాలా’ ‘ఓ మై బేబీ’ ‘కుర్చీ మడతపెట్టి’ వంటి లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘దమ్ మసాలా’ పాటకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ మిగతా రెండు పాటలు మిక్స్డ్ రెస్పాన్స్ ను మూటగట్టుకున్నాయి. ఇప్పుడు 4 వ పాటను విడుదల చేశారు మేకర్స్. నిన్న గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఈ పాటను విడుదల చేయడం జరిగింది. అయితే యూట్యూబ్లో కాస్త టైం తీసుకుని వదిలారు.
‘మావా ఎంతైనా పర్లేదు బిల్లు .. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు.. గుండెలోతుల్లో గుచ్చింది ముల్లు’ అంటూ మొదలైన ఈ పాట ఆరంభం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ తర్వాత తమన్ గత సినిమాల్లోని ట్యూన్స్ రావడంతో రొటీన్ గా మారింది. ‘అరవింద సమేత’ లోని ‘పెనిమిటి’ పాట ట్యూన్ కూడా గుర్తొచ్చేలా సాగింది (Guntur Kaaram) ఈ పాట. కానీ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ పాటపై ఇంట్రెస్ట్ కలిగేలా చేశాయి.
‘మారిపోయే లోకం …. చెడ్డోళ్లంతా ఏకం, నాజూకైన నాబోటోడికి ….. దిన దిన మొక నరకం, యాడో లేదు లోపం …… నామీదే నాకు కోపం,అందనంత ఆకాశానికి ….. ఎంతకని ఎగబడతాం ‘ అంటూ మధ్యలో వచ్చే లిరిక్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతాయి. సింగర్స్… రామాచారి కొమండూరి , శ్రీ కృష్ణ , రాహుల్ సిప్లిగంజ్..లు ఈ పాటని ఆలపించిన విధానం బాగుంది.
అలాగే ఈ లిరికల్ సాంగ్స్ లో మహేష్ బాబు.. మాస్ డాన్స్ మూమెంట్స్ ని కూడా చూపించారు.అవి కూడా హైలెట్ అని చెప్పాలి. మొత్తానికి ఈ ‘మావా ఎంతైనా’ పాట పాస్ మార్కులు వేయించుకుంటుంది అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!